తల్లి కాబోతున్న ఇలియానా?

is Heroine Ileana Pregnant - Sakshi

ప్రముఖ నటి ఇలియానా తల్లి కాబోతోందా..? అంటూ బీటౌన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గత కొంత కాలంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ తో ఇలియానా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాహం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఇలియానా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేస్తూ, ‘హబ్బీ’ (భర్త) అని కామెంట్‌ చేస్తూ ఉంటుంది. అయితే ఇపుడు ఇలియానా తల్లి కాబోతున్నారని తాజా రూమర్‌.

అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో కలిసి రైడ్ చిత్రంలో కథానాయిక‌గా న‌టించింది ఇలియానా. ఇటీవ‌లే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది. దీంతో  సినిమా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఇలియానా, తాను గర్భం దాల్చిన సంగతి బయటపడకుండా ఉండేందుకు లూజు, తేలికైన డ్రస్సుల్లో కనిపిస్తున్నారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా ఆండ్రూ తన ఇన్‌ స్టాగ్రామ్‌లో ఇలియానా ఫొటోను షేర్‌ చేశాడు. బాత్‌ టబ్‌ లో కాఫీ తాగుతూ ఉన్న ఇలియానా ఫోటోకు ఆండ్రూ ‘ఇలియానా ఒంటరిగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు’  అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో ఆమె నిజంగానే గర్భం దాల్చినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే పెళ్లి గురించే ఇప్పటివరకూ స్పందించని ఇలియానా తాజా ప్రచారంపై ఏమంటారో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top