యువరాణి పట్టం హన్సికకేనా? | Heroine Hansika acting in the movie Sangamitra? | Sakshi
Sakshi News home page

యువరాణి పట్టం హన్సికకేనా?

Jul 1 2017 1:36 AM | Updated on Sep 5 2017 2:52 PM

యువరాణి పట్టం హన్సికకేనా?

యువరాణి పట్టం హన్సికకేనా?

సంఘమిత్ర చిత్రం గురించి వార్తల్లో అధికంగా నానుతోంది.

తమిళసినిమా: సంఘమిత్ర చిత్రం గురించి వార్తల్లో అధికంగా నానుతోంది. మొదట ఇలయదళపతి విజయ్, టాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌బాబులను కథానాయకులుగా నటింపజేసే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అందులో నటించడానికి వారిద్దరూ ధైర్యం చేయలేక పోయారు. కారణం కాల్‌షీట్స్‌ సమస్యేనని సమాచారం. చివరికి యువ హీరోలు జయంరవి, ఆర్య సుమారు 200 రోజులు ఈ చిత్రం కోసం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. ఇక కథానాయకి విషయంలోనూ అదే పరిస్థితి. ఇందులో హీరోయిన్‌ కోసం పలువురి పేర్లు ప్రచారమయ్యాయి. శ్రుతీహాసన్‌ నటించడానికి రెడీ అయ్యారు కూడా. దీంతో కాస్త రిలాక్స్‌ అయిన చిత్ర యూనిట్‌కు ఆ బ్యూటీ వైదొలగడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

సంఘమిత్రలో యువరాణి కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. మధ్యలో హన్సిక పేరు వినిపించింది. అయితే మార్కెట్‌ డౌన్‌ అయిన హన్సికపై నిర్మాతల వర్గం ఆసక్తిని చూపలేదనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఆ తరువాత నయనతారతో చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ లీకైంది. అయితే చేతి నిండా చిత్రాలున్న నయనతార సంఘమిత్ర చిత్రం కోసం రెండేళ్లు కాల్‌షీట్స్‌ కేటాయించడానికి సిద్ధంగా లేరనే ప్రచారంలో జరుగుతోంది. తాజాగా మళ్లీ హన్సికనే సంఘమిత్రలో యువరాణిని చేసే పనిలో చిత్ర వర్గాలు ఉన్నట్లు తెలిస్తోంది. ఈ ముద్దుగుమ్మతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

కాగా తేనాండాళ్‌ ఫిలింస్‌ బాహుబలి తరహాలో బ్రహ్మండంగా రూపొం దించడానికి సన్నాహాలు చేస్తున్న సంఘమిత్ర చిత్రానికి సుందర్‌.సీ దర్శకత్వాన్ని, ఏఆర్‌.రెహ్మన్‌ సంగీతాన్ని. సబుసిరిల్‌ కళాదర్శకత్వాన్ని అందిస్తున్నారు. చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement