చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ప్రముఖ నటుడి కూతురు చేస్తున్న పని అలాగే ఉంది. అసలే ఇది డిజిటల్ యుగం. సెలబ్రిటీలు చిన్న పొరపాటు చేస్తే చాలు దాన్ని భూతద్దంలో పెట్టి మరీ ట్రోల్ చేస్తుంటారు. అలాంటిది ఒక వీడియోను కావాలనే సబ్‌స్క్రిప్షన్స్ మెంబర్స్ కోసం పోస్ట్ చేయడమేంటో, అది వైరల్ అవడంతో తప్పయిందంటూ క్షమాపణలు చెప్పడమేంటో తనకే తెలియాలి! ఇంతకీ ఏం జరిగిందో చూసేద్దాం..
బోల్డ్ వీడియో
మలయాళ నటుడు కృష్ణ కుమార్‌కు నలుగురు కూతుర్లు సంతానం. వీరిలో అహానా, ఇషాని కృష్ణలు యాక్టర్స్‌గా చెలామణీ అవుతున్నారు. దియా, హన్సికలు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు పెట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారి కోసం ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోలు వదులుతున్నారు. అలా హన్సిక కూడా కాస్త బోల్డ్ వీడియో ఒకటి తన సబ్‌స్క్రైబర్ల కోసం పోస్ట్ చేసింది.
డబ్బు కోసం దిగజారాలా?
అది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.299గా ఉంటే ఆ వీడియో తర్వాత రూ.399గా ధర ఫిక్స్ చేసింది. దీంతో డబ్బు కోసం ఇంతకు దిగజారాలా? ఇలాంటి వీడియోలు పెట్టాలా? అని జనం తిట్లదండకం అందుకున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న హన్సిక.. పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ ఓ లేఖ వదిలింది. 'ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ కింద మూడు వారాల క్రితం ఓ వీడియో షేర్ చేశాను. బుద్ధి లేక, నిర్లక్ష్యంగా ఆ పని చేశాను. అందుకు నెల రోజులుగా బాధపడుతున్నాను.
ఐదు నిమిషాల్లో డిలీట్.. అయినా!
అసలు ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేశానో నాకే అర్థం కావడం లేదు. తప్పు జరిగిపోయింది. కేవలం పోస్ట్ చేసిన ఐదు నిమిషాల్లోనే దాన్ని డిలీట్ చేశాను. కానీ, అప్పటికే కొందరు దాన్ని రికార్డు చేసి వైరల్ చేశారు. డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం ఇలా చేశానని కొందరు దారుణంగా మాట్లాడుతున్నారు. నాకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదు. 20 ఏళ్లకే నా బాగోగులు నేను చూసుకునేంత సంపాదించడం మొదలుపెట్టాను.
చాలా భయపడ్డా..
ఎన్నో ఏళ్లుగా మీరందరూ నాపై, నా కుటుంబంపై ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉన్నారు. కాబట్టి కొత్తగా నేను పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. నేను, నా సోదరి ఏడాదికాలంగా ఓ మ్యూజిక్ వీడియో కోసం ఎంతగానో కష్టపడ్డాం. అందులో నేను యాక్ట్ చేశాను. ఈ వివాదం చెలరేగిన మూడు రోజులకే ఆ పాట రిలీజైంది. నా వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందేమోనని చాలా భయపడ్డాను. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు.
భరించలేకున్నా..
ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయింది నేను, నా కుటుంబం. దీనికితోడు ఆన్‌లైన్‌లో వేధింపులు, విద్వేషపూరిత కామెంట్లు మరింత బాధిస్తున్నాయి. విమర్శించకూడదని నేను అనడం లేదు, కానీ ఆ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. వారి కంటెంట్ కోసం నన్ను వాడుకుంటున్నారు. నా బాధ వారికి సంతోషంగా ఉంది. మనుషులు అవతలివారిని ఇట్టే ద్వేషిస్తారని ఈ సంఘటన వల్లే తెలిసొచ్చింది.
పూర్తిగా ఎత్తేయాలనుకున్నా..
నేను సింపతీ కోసం ఇదంతా చెప్పడం లేదు. నా మనసులో భారాన్ని దించుకోవడానికి చెప్తున్నాను. మరి సబ్‌స్క్రిప్షన్ ధర ఎందుకు పెంచావని అడుగుతున్నారు. నిజానికి ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఎత్తేయాలనుకున్నాను. కానీ, దానివల్ల ఈ వివాదం మరింత ముదురుతుందనిపించింది. ఈ సమయంలో కొత్త సబ్‌స్క్రైబర్లను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ధర పెంచాను.
క్షమించండి
ఈ వివాదం తర్వాత సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని సామాజిక సేవకు వినియోగిస్తాను. అందులో ఒక్క రూపాయి కూడా నేను వాడను. నేను చేసిన పిచ్చి పని వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో నాకు అండగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు థాంక్స్' అని హన్సిక రాసుకొచ్చింది.


