కీర్తి కోసం అడ్జస్ట్ అవుతున్న విక్రమ్..! | Hero Vikram Dates Adjusted for Keerthy Suresh | Sakshi
Sakshi News home page

కీర్తి కోసం అడ్జస్ట్ అవుతున్న విక్రమ్..!

May 10 2017 10:28 AM | Updated on Sep 5 2017 10:51 AM

కీర్తి కోసం అడ్జస్ట్ అవుతున్న విక్రమ్..!

కీర్తి కోసం అడ్జస్ట్ అవుతున్న విక్రమ్..!

సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే సక్సెస్ ఫుల్ నటీనటులకు, టెక్నిషియన్స్కు యమా డిమాండ్ ఉంటుంది. అదే బాటలో

సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే సక్సెస్ ఫుల్ నటీనటులకు, టెక్నిషియన్స్కు యమా డిమాండ్ ఉంటుంది. అదే బాటలో హీరోయిన్ కీర్తి సురేష్ జోరు ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్లలో మామూలుగా లేదు. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతోనూ వరుసగా సినిమాలు చేసేస్తుంది ఈ హోమ్లీ బ్యూటీ. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించటంతో ఆమెకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

అందుకే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా కీర్తి డేట్స్ కోసం తానే అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. విలక్షణ నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్, మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరి దర్శకత్వంలో సామి 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ను హీరోయిన్గా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కీర్తి బిజీగా ఉండటంతో ఆమె డేట్స్కు తగ్గట్టుగా విక్రమ్ తన డేట్స్ను అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. కొంత కాలంగా తన రేంజ్కు తగ్గ హిట్ ఇవ్వలేకపోతున్న విక్రమ్ కూడా కీర్తి లక్ మీద నమ్మకం పెట్టుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement