చనిపోయేలోపు పాక్‌కు వెళ్లాలని ఉంది: హీరో | Hero Rishi Kapoor says i want to see pakistan before die | Sakshi
Sakshi News home page

చనిపోయేలోపు పాక్‌కు వెళ్లాలని ఉంది: హీరో

Nov 12 2017 7:48 PM | Updated on Nov 12 2017 7:48 PM

Hero Rishi Kapoor says i want to see pakistan before die - Sakshi

ముంబై: అనాటి హీరో రిషి కపూర్‌ ఒక్కసారిగా పాకిస్తాన్‌పై ప్రేమ చూపిస్తున్నారు. ఎప్పుడూ పాక్‌పై కామెంట్లు చేసి, భారత్‌కు మద్దతు తెలిపేవారు. కానీ చనిపోయేలోపు పాకిస్తాన్‌కు వెళ్లి రావాలని ఉందంటున్నారు. రిషి కపూర్‌ ఎందుకు ఈ విధంగా అన్నారంటే.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) పాకిస్తాన్‌కే చెందుతుందని , భారత్‌-పాక్‌ మధ్య దీని కోసం ఎన్ని యుద్ధాలు జరిగినా పరిస్థితిలో మార్పు ఉండబోదని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరుఖ్‌ అబ్దుల్లా శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఆయన మాటలకు రిషి కపూర్‌ స్పందించి.. ‘  ఫరుక్‌ అబ్దుల్లా జీ సలాం.. మీరు అన్న మాటలను నేను ఏకీభవిస్తున్నాను. జమ్ముకశ్మీర్‌ మనది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) పాకిస్తాన్‌ వారిది. నా వయసు ప్రస్తుతం 65 సంవత్సరాలు. మరణించే లోపు పాకిస్తాన్‌కు వెళ్లి రావాలన్నది నా కోరిక. నా పిల్లలు అక్కడి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టండి జీ’ అని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ట్విట్‌’  చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement