వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

Hero Ram Pothineni Statutory Warning Ismart Shankar - Sakshi

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్‌. పూరి మార్క్‌ మాస్ యాక్షస్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ ‘ఏ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

గతంలో పూరి దర్శకత్వంలో రిలీజ్‌ అయిన దేశముదురు, పోకిరి, బిజినెస్‌మేన్‌ లాంటి సినిమాలు ఏ సర్టిఫికేట్‌తోనే సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్‌ విషయంలోనూ అదే సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్‌ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. ఈ సందర్భంగా రామ్‌ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

సినిమాల్లో ప్రారంభమయ్యే ముందు వేసే స్టాట్యూటరీ వార్నింగ్‌ తరహాలో ‘ధూమపానం, మద్యపానంతో పాతో ఇస్మార్‌ శంకర్‌లా నిజజీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ఇస్మార్‌ శంకర్‌ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకోగలిగినంత ఇస్మార్ట్‌గా వ్యవహరించండి ’ అంటూ ట్వీట్‌ చేశారు. రామ్‌ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top