పది రోజుల్లో పండగ మొదలు | hero ram new movie pandaga chesko pandaga chesko regular shooting from june12 | Sakshi
Sakshi News home page

పది రోజుల్లో పండగ మొదలు

Jun 1 2014 11:14 PM | Updated on Sep 2 2017 8:10 AM

పది రోజుల్లో పండగ మొదలు

పది రోజుల్లో పండగ మొదలు

ప్రేక్షకులు పండగ చేసుకునే స్థాయిలో మా ‘పండగ చేస్కో’ ఉంటుందని నిర్మాత పరుచూరి కిరీటి అంటున్నారు. రామ్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న

ప్రేక్షకులు పండగ చేసుకునే స్థాయిలో మా ‘పండగ చేస్కో’ ఉంటుందని నిర్మాత పరుచూరి కిరీటి అంటున్నారు. రామ్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12న మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇందులోని హీరో పాత్ర చిత్రణ రామ్ శారీరకభాషకు తగ్గట్టుగా ఉంటుంది. రామ్ అత్యంత శక్తిమంతమైన పాత్రను పోషించనున్నారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోనవెంకట్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: పరుచూరి ప్రసాద్.
 

Advertisement
 
Advertisement
Advertisement