ఆ హీరో శాలరీ కోటి రూపాయలు! | Hero raj tharjun's salary is now rs.1 crore | Sakshi
Sakshi News home page

ఆ హీరో శాలరీ కోటి రూపాయలు!

Dec 7 2015 10:15 AM | Updated on Sep 3 2017 1:38 PM

ఆ హీరో  శాలరీ కోటి రూపాయలు!

ఆ హీరో శాలరీ కోటి రూపాయలు!

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెత తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు.

హైదరాబాద్ : దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెత తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. నిన్న మొన్నటి వరకూ లక్షల్లో పారితోషికం తీసుకునే ఈ హీరో తాజాగా కోటి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన రాజ్ తరుణ్ ...ఇప్పుడు చిన్న నిర్మాతల పాలిట మినిమమ్ గ్యారంటీ 'హీరో'గా  మారాడు.

 

డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ సారథ్యంలో ఇటీవల విడుదలైన 'కుమారి 21 ఎఫ్' చిత్రం విజయంతో రాజ్ తరుణ్ కోటి క్లబ్లోకి చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఈ చిత్రానికి గానూ ఈ యువ హీరో రూ.25 లక్షలు తీసుకున్నాడు. బ్యానర్తో పాటు టాప్ టెక్నిషియన్లు ఉండటంతో రాజ్ తరుణ్  తన రేటును తగ్గించినట్లు తెలుస్తోంది.

ఇక 'సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు' సినిమా నుంచే రాజ్ తరుణ్  కోటి రెమ్యునరేషన్ ను అప్లయి చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాంగోపాల్ వర్మ, వంశీ దర్శకత్వంలో అతడు నటిస్తున్నాడు. కాగా కుమారి 21 ఎఫ్ సక్సెస్తో రాజ్ తరుణ్కు టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అతడి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీంతో రాజ్ తరుణ్ తన పారితోషకాన్ని అమాంతం పెంచేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement