పొరుగింట్లో కల్యాణి | Hello heroine Kalyani Priyadarshan | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 13 2017 9:54 AM | Last Updated on Wed, Dec 13 2017 9:54 AM

Hello heroine Kalyani Priyadarshan - Sakshi

తమిళ సినిమా: పొరిగింటి పుల్లకూర రుచి అన్నది అనాధిగా ఉన్న నానుడి. అంటే మనింట్లో కూరు రుచిని గుర్తించలేమనేగా అర్థం. ఇది వాస్తవంగా కూడా చాలా సార్లు నిజమైంది. కమలహాసన్‌ వారుసురాలు శ్రుతిహాసన్‌ నటిగా పరిచయమైంది బాలీవుడ్‌లోనే. ఆ తరువాత టాలీవుడ్, ఆపై కోలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. ఒకప్పటి అందాల తార రాధ కూతురు కార్తీక మలయాళీనే. నటి రాధ మాత్రం కోలీవుడ్, టాలీవుడ్‌లలో కథానాయకిగా రాణించారు. అలాంటిది తన కూతుర్ని హీరోయిన్‌గా పరిచయం చేయడానికి రాధ మాలీవుడ్, కోలీవుడ్‌ల్లో చాలా ప్రయత్నాలు చేశారు. అయితే తొలుత అవకాశం వచ్చింది మాత్రం టాలీవుడ్‌లోనే. జోష్‌ అనే చిత్రంలో నాగచైతన్యకు జంటగా పరిచయమైంది. ఆ తరువాత కోలీవుడ్‌లో నటించిందనుకోండి. 

ఇక అతిలోక సుందరి శ్రీదేవి తన కూతురు జాన్వీని తొలుత తెలుగులో పరిచయం చేయాలని భావించారు.అయితే తాజాగా హిందీ చిత్రం ద్వారా జాన్వి పరిచయం అవుతోంది. ఇక చాలా మంది హీరోయిన్లు పొరుగు భాషా చిత్రాల ద్వారనే పరిచయమై ఆ తరువాత మాతృభాషలో అవకాశాలను అందుకున్నారు. తాజాగా కల్యాణి విషయంలోనూ ఇదే జరిగింది.ఇంతకీ కల్యాణి ఎవరో చెప్పలేదు కదూ. ప్రముఖ మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్,  నటి లిజీల కూతురే ఈ బ్యూటీ. కొంత కాలం క్రితం ప్రియదర్శన్, లిజీ సుమారు 25 ఏళ్లు కలిసి కాపురం చేసి ఈ మధ్యనే మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరికి ఒక కూతురు, కొడుకు.ఆ కూతురే కల్యాణి. న్యూయార్క్‌లో చదువుకుంటున్న కల్యాణిని హీరోయిన్‌ చేయడానికి లిజీ కోలీవుడ్‌లో చాలా ప్రయత్నాలే చేశారు. అయితే అవేవి ఫలించలేదు. అలాంటిది టాలీవుడ్‌ కల్యాణిని కథానాయకిగా సాగ్వతించింది.  అఖిల్‌ హీరోగా నటించిన హలో చిత్రం ద్వారా కల్యాణి కథానాయకిగా పరిచయమవుతోంది. 24 చిత్రం ఫేమ్‌ విక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 22వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రం హిట్‌ అయితే ఆ తరువాత కోలీవుడ్‌లో కల్యాణిని రెడ్‌ కార్పెట్‌తో స్వాగతిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement