గురువారం జూలై 20...ఓ సర్‌ప్రైజ్‌! | Heavy-duty visual effects for Mahesh Babu's next flick SPYder | Sakshi
Sakshi News home page

గురువారం జూలై 20...ఓ సర్‌ప్రైజ్‌!

Jul 13 2017 10:42 PM | Updated on Sep 5 2017 3:57 PM

గురువారం జూలై 20...ఓ సర్‌ప్రైజ్‌!

గురువారం జూలై 20...ఓ సర్‌ప్రైజ్‌!

... హెడ్డింగ్‌ చదవగానే మహేశ్‌బాబు ‘దూకుడు’లోని ‘గురువారం మార్చి ఒకటి..

... హెడ్డింగ్‌ చదవగానే  మహేశ్‌బాబు ‘దూకుడు’లోని  ‘గురువారం మార్చి ఒకటి.. సాయంత్రం ఫైవ్‌ ఫార్టీ... తొలిసారిగా చూశానె నిన్ను...’ పాట గుర్తొస్తోంది కదూ! యూత్‌ పాడుకునే పాటల్లో ఈ పాట కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోతున్నది గురువారం జూలై 20 గురించి. ఆ రోజు స్పెషల్‌ ఏంటి అనుకుంటున్నారా? మహేశ్‌బాబు–నమ్రతల ముద్దుల కూతురు సితార బర్త్‌డే. ఈ సందర్భంగా మహేశ్‌ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేయాలని ‘స్పైడర్‌’ యూనిట్‌ భావిస్తోందట. సితార పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్, ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. ఆ పాట చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలు వెళ్లనున్నారు.

వచ్చే నెల 2న సాంగ్‌ షూట్‌ మొదలు కానుంది. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో స్పైడర్‌ రూపంలో ఉన్న రోబో కీలకం అనే సంగతి తెలిసిందే. ఆ రోబోని సృష్టించడానికి బాగా ఖర్చు పెడుతున్నారట. హాలీవుడ్‌ స్థాయిలో సినిమా ఉంటుందని యూనిట్‌ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇండియాలోనే కాకుండా రష్యా, యూకె.. ఇలా విదేశాల్లో కూడా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చేయిస్తున్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement