సంగీత మాంత్రికుడి శుభాకాంక్షలు | Healthy atmosphere in the film industry now | Sakshi
Sakshi News home page

సంగీత మాంత్రికుడి శుభాకాంక్షలు

May 9 2017 1:18 AM | Updated on Aug 20 2018 3:40 PM

సంగీత మాంత్రికుడి శుభాకాంక్షలు - Sakshi

సంగీత మాంత్రికుడి శుభాకాంక్షలు

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగుతోందని చెప్పవచ్చు.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగుతోందని చెప్పవచ్చు. ఒకరిపై ఒకరు రాగధ్వేషాలు పెంచుకోకుండా స్నేహహస్తాన్నే అందిస్తున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదనుకుంటా. ముఖ్యంగా కొత్తవారిని ప్రోత్సహించే సుహృద్భావన వాతావరణం ఇక్కడ కొనసాగుతోందనే అనాలి. ఇందుకు చిన్న ఉదాహరణ ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌. రెహ్మాన్‌. నవ సంగీత దర్శకుడు రామ్‌గోపాల్‌ కృష్ణన్‌ పరిచయం అవుతున్న చిత్రం లాలీ లాలీ ఆరారో. సినీయర్‌ నటుడు చరణ్‌రాజ్‌ వారసుడు తేజ్‌రాజ్‌ కథానాయకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి లింకన్‌ రాజాళీ దర్శకుడు.

ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. కాగా, సంగీత దర్శకుడు రామ్‌గోపాల్‌ కృష్ణన్‌ సోమవారం సంగీత మాంత్రికుడు ఏఆర్‌. రెహ్మాన్‌ను కలిసి తన తొలి చిత్ర సంగీత ఆల్బం వినిపించారు. పాటలు విన్న ఏఆర్‌. రెహ్మాన్‌ చాలా బాగున్నాయంటూ రామ్‌గోపాల్‌ కృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తెలుపుతూ సంతోషంతో ఉప్పొంగిపోయారు.

మరో విషయం ఏమిటంటే సంగీతజ్ఞాని ఇళయరాజా గురువు టీవీ. గోపాలకృష్ణన్‌ కుమారుడే రామ్‌గోపాల్‌ కృష్ణన్‌ అన్నది గమనార్హం. లాలీ లాలీ ఆరారో చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర ఆడియోను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆవిష్కరించడం మరో విశేషం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement