ఎవరైనా విజయాలను తమకు ఆపాదించుకోవడంలో ముందుంటారు. అపజయాలను ఇతరులపై నెడుతుంటారు. ఇది సహజం. అపజయాలకు బాధ్యత వహించేవారు చాలా తక్కువనే చెప్పాలి. ఆ మధ్య సల్మాన్‌ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన హిందీ చిత్రం సికిందర్. తమిళ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై పూర్తిగా నిరాశ పరచింది. దీంతో ఈ చిత్రం ఫ్లాప్‌పై దర్శకుడు మురుగదాస్ స్పందిస్తూ ఉత్తరాదిలో సల్మాన్‌ఖాన్ బెదిరింపులను ఏదుర్కొంటున్న కారణంగా షూటింగ్‌ను పగలు చేయడం సాధ్యం కాక పగలు చిత్రీకరించాల్సిన సన్నివేశాలను కూడా రాత్రి వేళల్లో చేయాల్సి వచ్చిందని చెప్పారు.

సల్మాన్‌ఖాన్ షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చేవారు అని చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. సికిందర్ డిజాస్టర్‌లో తన పాత్ర లేదని కూడా చెప్పారు. దీంతో సల్మాన్ అభిమానులు దర్శకుడు మురుగదాస్‌పై విమర్శల దాడి చేశారు. సల్మాన్‌ఖాన్ కూడా మురుగదాస్ వ్యాఖ్యలకు పరోక్షంగా గట్టిగానే బదులిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్నా ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సికిందర్ కథను దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తనకు చెప్పినప్పుడు బాగుందని.
అయితే షూటింగ్‌లో వేరే విధంగా మారిపోయిందని పేర్కొన్నారు. ఆ చిత్ర అపజయంలో తన బాధ్యత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కాగా హిందీలో మంచి సక్సెస్‌లో ఉన్న రష్మిక మందన్నాకు సికిందర్ చిత్రం పూర్తిగా నిరాశపరిచందన్నది గమనార్హం. మొత్తం మీద సికిందర్ చిత్రం విడుదలై చాలా కాలం అయినా, దాని గురించి రచ్చ ఇంకా జరుగుతూనే ఉందన్నది గమనార్హం.


