రోమ్‌లో సరదాగా..! | Harman Baweja planning to take Bipasha Basu to Rome | Sakshi
Sakshi News home page

రోమ్‌లో సరదాగా..!

Jan 18 2014 12:55 AM | Updated on Sep 2 2017 2:43 AM

రోమ్‌లో సరదాగా..!

రోమ్‌లో సరదాగా..!

బిపాసా బసు గత జీవితంలో కీలక ఘట్టం జాన్ అబ్రహాంతో చేసిన తొమ్మిదేళ్ల సహజీవనం. అప్పట్లో అది మధురంగా అనిపించిన బిప్స్‌కి, ఇప్పుడది పీడకలలా తయారయ్యింది.

బిపాసా బసు గత జీవితంలో కీలక ఘట్టం జాన్ అబ్రహాంతో చేసిన తొమ్మిదేళ్ల సహజీవనం. అప్పట్లో అది మధురంగా అనిపించిన బిప్స్‌కి, ఇప్పుడది పీడకలలా తయారయ్యింది. జాన్ నుంచి విడిపోయిన తర్వాత అతని జ్ఞాపకాలను చెరిపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి, సక్సెస్ అయ్యారామె. కానీ, ఇటీవల జాన్ అబ్రహాం పెళ్లి చేసుకోవడంతో మరోసారి గతంలోకి వెళ్లిపోయి, దిగులుగా ఉంటున్నారట బిపాసా. ఆమె బాధను తాజా ప్రియుడు హర్మాన్ బవేజా చూడలేకపోతున్నారట.
 
బిపాసాని ఆ మూడ్ నుంచి బయటపడేయడానికి ఎక్కడికైనా విహారయాత్రకు తీసుకెళితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారని వినికిడి. రోమ్ అంటే బిపాసాకి చాలా ఇష్టం అట. అందుకని, అక్కడికి తీసుకెళితే బిపాసా మామూలు మనిషి అవుతుందన్నది హర్మాన్ అభిప్రాయం. వీలు చూసుకుని ప్రేయసితో రోమ్ చెక్కేయాలనుకుంటున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement