జనవరి నుంచి జిగర్‌తండా! | Harish Shankar to remake Jigarthanda | Sakshi
Sakshi News home page

జనవరి నుంచి జిగర్‌తండా!

Nov 24 2018 5:39 AM | Updated on Nov 24 2018 5:39 AM

Harish Shankar to remake Jigarthanda - Sakshi

హరీశ్‌ శంకర్‌

‘డిజే’ సినిమా రిలీజ్‌ అయిపోయి ఏడాదిన్నర కావస్తున్నా తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఏంటో తెలియజేయలేదు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ‘దాగుడుమూతలు’ అనే మల్టీస్టారర్‌ చిత్రం కోసం కొన్ని రోజులు వర్క్‌ చేశారు. ఇప్పుడు తమిళ హిట్‌ చిత్రం ‘జిగర్‌తండా’ (కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ హీరో)ని రీమేక్‌ చేసే పనిలో పడ్డారు హరీశ్‌. ‘‘ఈ సినిమా జనవరిలో స్టార్ట్‌  కానుంది. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తారు. హీరో ఇంకా ఫైనలైజ్‌ కాలేదు’’ అని విశ్వసనీయ వర్గాల సమాచారం.  ‘దబాంగ్‌’ రీమేక్‌ ‘గబ్బర్‌సింగ్‌’తో దర్శకుడిగా పెద్ద సక్సెస్‌ అందుకున్నారు హరీశ్‌. మరి ఈ రీమేక్‌ ఏ రేంజ్‌ సక్సెస్‌ తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా వరుణ్‌ తేజ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement