నయనతార @ : 32 | Sakshi
Sakshi News home page

నయనతార @ : 32

Published Sun, Nov 20 2016 2:17 AM

నయనతార @ :  32

 లేడీసూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయనతార. ఈ మధ్య హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలను వరుస పెట్టి చేసేస్తున్నారు. అదే విధంగా ప్రముఖ కథానాయకులు, యువ కథానాయకులు అంటూ బేధం లేకుండా అందరితోనూ నటించడం విశేషం. శుక్రవారం నయనతార 32 ఏళ్లను అధిగమించారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా స్టార్ హీరోలకు దీటుగా తాను నటిస్తున్న రెండు నూతన చిత్రాల ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేయడం విశేషం. 
 
 అందులో ఒకటి నయనతార కలెక్టర్‌గా నటిస్తున్న అరమ్ చిత్రం కాగా, రెండవది కొలైయుధీర్ కాలం. ఇది యాక్షన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కనుంది. దీనికి ఇంతకు ముందు కమలహాసన్ హీరోగా ఉన్నైపోల్ ఒరవన్, అజిత్‌తో బిల్లా-2 చిత్రాలను తెరకెక్కించిన చక్రి తోలేటి దర్శకత్వం వహించనున్నారు. నయనతార తన 32వ పుట్టినరోజు వేడుకను శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న చిత్ర సెట్‌లో జరుపుకున్నారు.
 
  చిత్ర హీరో శివకార్తికేయన్, దర్శకుడు మోహన్‌రాజా, నిర్మాత ఆర్‌డీ. రాజా ఆమెకు పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసిన నయనతార యూనిట్ సభ్యులందరికీ ఆ కేక్‌ను పంచిపెట్టారు. అదే విధంగా వారందిరితోనూ ఫొటోలు దిగి వారిని సంతోషంలో ముంచెత్తారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement