హ్యాపీ బర్త్ డే- 31-05-15 | Happy birthday | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్ డే- 31-05-15

May 31 2015 1:20 AM | Updated on Sep 3 2017 2:57 AM

హ్యాపీ బర్త్ డే- 31-05-15

హ్యాపీ బర్త్ డే- 31-05-15

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: భానుచందర్ (నటుడు), బ్రూక్ షీల్డ్స్(హాలీవుడ్ నటి)

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: భానుచందర్ (నటుడు),  బ్రూక్ షీల్డ్స్(హాలీవుడ్ నటి)

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8. ఈ సంవత్సరం వీరికి అత్యంత ప్రభావవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఎంతోకాలంగా పరిశ్రమలు స్థాపించాలను కుంటున్న వారి కల నెరవేరుతుంది. నష్టాల్లో ఉన్న సంస్థలు లాభాల బాట పడతాయి. అయితే రాహుప్రభావం వల్ల కొన్ని గుర్తు తెలియని అనారోగ్యాలు పీడించవచ్చు. ఎం.బి.ఎ, ఎంసిఎ చేయాలనుకుంటున్న వారి కోరిక తీరుతుంది.
 
 లీగల్ సర్వీసులలో ఉన్న వారికి మంచి పేరుతోబాటు ఆదాయం కూడా లభిస్తుంది. అయితే గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోకూడదన్నట్లు... వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అవసరం. లేదంటే చాలా సమయం, డబ్బు వృథా అవుతాయి. లక్కీ నంబర్స్: 4,5,6,8; లక్కీ కలర్స్: వయొలెట్, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని, ఆదివారాలు సూచనలు: ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అనాథలకు అన్నదానం, ఆవులకు, నల్లకుక్కలకు ఆహారం తినిపించాలి. శనికి తైలాభిషేకం, శివుడికి అభిషేకం జరిపించాలి.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement