మలయాళంలోనా...నేనా? | Hansika Motwani faces brunt of Mollywood fans | Sakshi
Sakshi News home page

మలయాళంలోనా...నేనా?

Sep 29 2014 11:31 PM | Updated on Apr 3 2019 6:23 PM

మలయాళంలోనా...నేనా? - Sakshi

మలయాళంలోనా...నేనా?

మలయాళంలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హన్సిక స్పష్టం చేశారు. కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే ముందుగా వచ్చేది హన్సిక పేరే. వరుస విజయాలతో దూసుకుపోతున్న

మలయాళంలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హన్సిక స్పష్టం చేశారు. కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే ముందుగా వచ్చేది హన్సిక పేరే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజా చిత్రం అరణ్మణై విజయం ఈ ముద్దు గుమ్మ క్రేజ్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం తెలుగులో కూడా విజయం కోసం ప్రయత్నిస్తున్న హన్సికకు బాలీవుడ్, మాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయట. బాలీవుడ్‌లో నటించే ఆలోచనలేదని ఇప్పటికే స్పష్టం చేసిన ఈ అమ్మడు మలయాళ చిత్ర రంగప్రవేశం చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మలయాళంలో దిలీప్‌కు జంటగా శాంతం శివం అనే చిత్రంలో నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని హన్సిక ఖండించారు.  తాను మలయాళంలో నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాను ఆర్య సరసన మిగామన్, విశాల్‌కు జంటగా ఆంబళ, జయం రవితో రోమియో జూలియట్ చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement