నటనకు బ్రేకిస్తా.. మళ్లీ పెళ్లి చేసుకుంటా! | Gwyneth Paltrow signals break from acting, but could marry again | Sakshi
Sakshi News home page

నటనకు బ్రేకిస్తా.. మళ్లీ పెళ్లి చేసుకుంటా!

Apr 3 2016 6:01 PM | Updated on Sep 3 2017 9:08 PM

నటనకు బ్రేకిస్తా.. మళ్లీ పెళ్లి చేసుకుంటా!

నటనకు బ్రేకిస్తా.. మళ్లీ పెళ్లి చేసుకుంటా!

రెండేళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకుంది అమెరికన్ నటి గ్వెనెత్‌ పాల్టో..

రెండేళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకుంది అమెరికన్ నటి గ్వెనెత్‌ పాల్టో..  'ఐరన్‌ మ్యాన్‌-3', 'ఐరన్‌ మ్యాన్‌', 'ఎమ్మా', 'షెక్‌స్పియర్‌ ఇన్ లవ్' వంటి సినిమాల్లో నటించి ఓసారి ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాల నుంచి కాస్త విరామం తీసుకోవాలనుకుంటోంది. మరో పెళ్లి చేసుకొని.. కుటుంబ ఆలనాపాలనా చూసుకోవాలని భావిస్తోంది. సొంత వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది.  

'కోల్డ్‌ ప్లే' బ్యాండ్ ప్రధాన సింగర్ క్రిస్ మార్టిన్‌కు 2014లో విడాకులు ఇచ్చిన గ్వెనెత్‌ ప్రస్తుతం ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తోంది. దానికితోడు 'గూప్‌' పేరిట ఓ లైఫ్‌స్టైల్‌ వెబ్‌సైట్‌ను ఆమె నడిపిస్తోంది. ఇప్పటివరకు మూడు వంటల పుస్తకాలు కూడా రాసింది. ఈ పనులతో బిజీగా ఉండటం వల్లే సినిమాల్లో నటించడం లేదని, ప్రస్తుతానికైతే కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకున్నట్టేనని ఆమె చెప్పింది.

ప్రస్తుతం టీవీ నిర్మాత బ్రాడ్ ఫాల్చుక్‌తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ 43 ఏళ్ల అమ్మడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని కూడా భావిస్తోంది. పెళ్లి అనేది ఉన్నతమైన, అందమైన అనుబంధమని, దానికి ఎప్పుడూ తాను దూరం కాబోనని చెప్తోంది. అయితే మళ్లీ తను ఎప్పుడు పెళ్లిపీఠలు ఎక్కబోతున్నదో మాత్రం ఆమె చెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement