కదిలించేలా ‘సర్వం తాళమయం’ ట్రైలర్‌

Gv Prakash Kumar Sarvam Thaalamayam Trailer - Sakshi

నటుడు, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్‌ హీరోగా తెరకెక్కిన సంగీత ప్రధాన చిత్రం సర్వం తాళమయం. వాయిద్యాలు తయారు చేసే కుటుంబంలో పుట్టిన కుర్రాడు సంగీత విద్వాంసుడు కావాలనుకుంటే అతనికి ఎదురైన కష్టాలు, అవమానాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది లాంటి సూపర్‌ హిట్ సినిమాలన తెరకెక్కించిన రాజీవ్‌ మీనన్‌ 18 ఏళ్ల విరామం తరువాత ఈ సినిమాతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పటికే తమిళ నాట రిలీజ్‌ అయిన ఈ సినిమాకు మంచి టాక్‌ రావటంతో ఈ నెల 8న తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రాయూనిట్‌. జీవి ప్రకాష్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top