నిధి కోసం అన్వేషణ | gulebakavali april 6 release | Sakshi
Sakshi News home page

నిధి కోసం అన్వేషణ

Mar 17 2018 12:28 AM | Updated on Mar 17 2018 12:29 AM

gulebakavali april 6 release - Sakshi

ప్రభుదేవా, హన్సిక

ప్రభుదేవా, హన్సిక జంటగా సీనియర్‌ నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గులేబకావళి’.  కల్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ అదేపేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఏప్రిల్‌ 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో కథ కొనసాగుతుంది.

పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌. ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా నృత్యాలు, నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. తమిళ ప్రేక్షకులు ఆదరించినట్టే తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్‌ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. మన్సూర్‌ అలీఖాన్, మధు, ఆనంద్‌ రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్‌ ఆనంద్‌ కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement