‘నా హీరోయిన్‌ చేతిలో దీపిక పని అయిపోతోంది’ | gst beating padmaavat | Sakshi
Sakshi News home page

నా హీరోయిన్‌ చేతిలో దీపిక పని అయిపోతోంది : వర్మ

Jan 26 2018 3:26 PM | Updated on Jan 26 2018 8:03 PM

gst beating padmaavat - Sakshi

సాక్షి, ముంబయి : జీఎస్‌టీ దూసుకెళుతోంది. జీఎస్‌టీ అంటే కేంద్రం పన్నులకోసం తీసుకొచ్చిన సంస్కరణ కాదు.. వివాదాలతో సహవాసం చేసే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన చిత్రం జీఎస్‌టీ (గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌). అవును! ఈ విషయాన్ని రామ్‌గోపాల్‌ వర్మనే ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. అది కూడా ఈ విషయం తాను చెప్పడం లేదని, ఎనాలిటిక్స్‌ చెబుతున్నాయని విశ్లేషణకు సంబంధించిన రేఖా చిత్రాన్ని పోస్ట్‌ చేసి మరి వర్మ ఆ విషయాన్ని నిర్దారించి చూపించారు. 'చూస్తుంటే మియామాల్కోవా (పోర్న్‌స్టార్‌) గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌ పేరిట చాలా వేగంగా దీపికా పదుకునేపై..... దండయాత్ర చేస్తున్నట్లుంది' అంటూ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఓ హాలీవుడ్‌ పోర్న్‌స్టార్‌తో రామ్‌ గోపాల్‌వర్మ జీఎస్‌టీ అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.

దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి. పైగా ఈ చిత్రాన్ని ఆపివేయాలంటూ మహిళా సంఘాలు చేసిన డిమాండ్లను కూడా ఆయన ఖాతరు చేయలేదు. పైగా తాను తీసిన చిత్రాన్ని ప్రమోషన్‌కు పనికొచ్చేలాగా ఆయనను నిలదీసిన వారికి సమాధానాలు చెప్పారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందు చెప్పినట్లుగానే రిపబ్లిక్‌ డేనాడే ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫాంపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ సినిమా పద్మావతి సినిమాను బీట్‌ చేస్తుందని వర్మ పోస్ట్‌ ద్వారా చెప్పారు. అంతేకాదు ప్రాంతాల వారీగా లెక్క చూపిస్తూ పద్మావత్‌ చిత్రాన్ని భారత్‌లో సగటున 39మంది చూస్తుండగా జీఎస్‌టీని మాత్రం 100మంది చూస్తున్నట్లు కూడా లెక్కలు తేల్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement