గ్యాంబ్లర్‌ యాక్షన్‌ | The Great Gambler Movie Trailer Release | Sakshi
Sakshi News home page

గ్యాంబ్లర్‌ యాక్షన్‌

Jan 6 2020 2:49 AM | Updated on Jan 6 2020 2:49 AM

The Great Gambler Movie Trailer Release - Sakshi

అర్చన రావ్‌, ధర్మ కీర్తిరాజ్

ధర్మ కీర్తిరాజ్, అర్చన రావ్‌ జంటగా వినోద్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది గ్రేట్‌ గ్యాంబ్లర్‌’.  మహేష్‌ సి. దర్శకత్వం వహించారు. ‘పద్మశ్రీ’ డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు సమర్పణలో శ్రీ సింహ వాహినీ పతాకంపై మడి పడిగేరాజు నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత రామసత్యనారాయణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఫుల్‌ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ఇది. ఇందులో వినోదకుమార్‌ యాక్షన్‌ బాగుంటుంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడికి మంచి పేరు వస్తుంది.

తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నిర్మాత అవ్వాలని చాలా ప్రయత్నం చేసి విఫలమయ్యాను. కానీ, రామ సత్యనారాయణగారి స్ఫూర్తితో ఎట్టకేలకు నిర్మాత అయ్యాను.. అందుకే ఆయన చేతులమీదుగా మా సినిమా ట్రైలర్‌ విడుదల చేయటం ఆనందంగా ఉంది. ట్రైలర్‌లాగే సినిమా కూడా బాగుంటుంది’’ అన్నారు మడి పడిగేరాజు. వాసవి బిజినెస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు ప్రసాద్, శ్రీహరి, చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు:  మనోజ్, ప్రవీణ్, అఖిల్, ఆధ్య, చరణ్, సంగీతం: అభిమాన్‌ రాయ్‌.

Advertisement
 
Advertisement
Advertisement