ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌ | Gopichand Chanakya Teaser Released | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌

Sep 9 2019 5:18 PM | Updated on Sep 9 2019 5:28 PM

Gopichand Chanakya Teaser Released - Sakshi

హీరో గోపిచంద్‌ సరైన హిట్‌ కొట్టి చాలా కాలమైంది. విరామం ఎరుగకుండా ప్రయత్నిస్తూ ఉన్న మునుపటిలా విజయాన్ని అందుకోలేకపోతున్నారు. చివరగా లౌక్యం సినిమాతో హిట్‌ కొట్టగా.. ఆక్సిజన్‌, గౌతమ్‌నంద, పంతం లాంటి సినిమాలను చేశాడు. అయినా అనుకున్న విజయాన్ని పొందలేకపోయాడు. మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాణక్యతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

రా ఏజెంట్‌గా అర్జున్‌ పాత్రలో గోపిచంద్‌ నటించిన ఈ మూవీ టీజర్‌ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌లో ఉన్న యాక్షన్‌ సీన్స్‌ ఈ చిత్రానికి హైలెట్‌గా మారనున్నాయి. ఈ మూవీలో మెహ్రీన్‌, జరీన్‌ ఖాన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించిన ఈ మూవీకి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement