ఈ నెల 23న వరుణ్తో నా ఎంగేజిమెంట్: త్రిష | going to be engaged with varun on 23rd, tweets trisha | Sakshi
Sakshi News home page

ఈ నెల 23న వరుణ్తో నా ఎంగేజిమెంట్: త్రిష

Jan 7 2015 4:03 PM | Updated on Aug 28 2018 4:30 PM

ఈ నెల 23న వరుణ్తో నా ఎంగేజిమెంట్: త్రిష - Sakshi

ఈ నెల 23న వరుణ్తో నా ఎంగేజిమెంట్: త్రిష

తన పెళ్లి విషయంలో ఇన్నాళ్లూ దోబూచులాడిన త్రిష.. ఎట్టకేలకు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పింది.

తన పెళ్లి విషయంలో ఇన్నాళ్లూ దోబూచులాడిన త్రిష.. ఎట్టకేలకు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పింది. జనవరి 23వ తేదీన వరుణ్తో తన నిశ్చితార్థం జరగనున్నట్లు ట్విట్టర్లో తెలిపింది. కేవలం తమ రెండు కుటుంబాలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతాయని తన అభిమానులు, స్నేహితులకు తెలిపింది.

అయితే తమ పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని, అందువల్ల దాని గురించి ఊహాగానాలు వద్దని కోరింది. ముహూర్తం ఖరారు కాగానే ఎప్పటిలాగే తానే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడిస్తానని త్రిష చెప్పింది. సినిమాలు వదిలిపెట్టాలన్న ఉద్దేశం ఏదీ తనకు లేదని, వాస్తవానికి రెండు కొత్త సినిమాలను కూడా తాను ఒప్పుకొంటున్నానని, 2015లో మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయని కూడా ట్విట్టర్ సందేశాలలో త్రిష చెప్పింది.

 

Advertisement
 
Advertisement
Advertisement