'అమ్మాయిలు నాకు రాఖీ కట్టలేదు' | Girls never 'offered' to tie me rakhi, says Sidharth | Sakshi
Sakshi News home page

'అమ్మాయిలు నాకు రాఖీ కట్టలేదు'

Aug 23 2015 3:54 PM | Updated on Apr 3 2019 8:56 PM

'అమ్మాయిలు నాకు రాఖీ కట్టలేదు' - Sakshi

'అమ్మాయిలు నాకు రాఖీ కట్టలేదు'

తనకు ఇప్పటి వరకూ ఎవ్వరూ రాఖీ ఆఫర్ చేయలేదని బాలీవుడ్ నటుడు, 'బ్రదర్స్' ఫేమ్ సిద్ధార్థ్ మల్హోత్రా అన్నాడు.

న్యూఢిల్లీ : తనకు ఇప్పటి వరకూ ఎవ్వరూ రాఖీ ఆఫర్ చేయలేదని బాలీవుడ్ నటుడు, 'బ్రదర్స్' ఫేమ్ సిద్ధార్థ్ మల్హోత్రా అన్నాడు.  ఈ నెల 14న విడుదలై విజయాన్ని అందుకున్న ‘బ్రదర్స్’లో అక్షయ్‌కుమార్, సిద్ధార్థ మల్హోత్రా అన్నదమ్ములుగా నటించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ గుడ్ లుక్ చూసి అమ్మాయిలు ఎవరూ తనకు రాఖీ కట్టలేదోమో అన్నాడు. ఈ నెల 29న హిందువుల పండుగ రాఖీ. అయితే ఇతరులలా తన చేతి రంగు రంగుల రాఖీలతో నిండే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లోనూ.. ఒక్క అమ్మాయి కూడా తనకు రాఖీ కట్టలేదని చెప్పాడు.

ఈ సందర్భంగా తన చిన్న నాటి విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. రాఖీ పండుగ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
మేం సాధారణంగా ఈ పండుగను జరుపుకోమన్నాడు. అయితే పంజాబీ పండుగ టికా జరుపుకుంటామని, అక్కాచెల్లెళ్లు వారి సోదరుల తలకు బొట్టు పెడతారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బ్రదర్స్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సిద్థార్థ్ మరిన్ని సినిమాలు చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. బ్రదర్స్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మితం కానుందనే వార్త కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement