సంకల్ప్.. ఈ సారి నేలమీదే, కానీ..!

రానా ప్రధాన పాత్రలో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా ఘాజీ. తొలి అండర్‌వాటర్ వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఘాజీ తరువాత రెండో ప్రయత్నంగా మరో ప్రయోగం చేశాడు సంకల్ప్. వరుణ్ తేజ్ హీరోగా స్పేస్‌బ్యాక్ డ్రాప్‌లో అంతరిక్షం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది.
తాజాగా సంకల్ప్ తన మూడో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తొలి సినిమాను సముద్రంలో, రెండో సినిమాను అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కించిన సంకల్ప్ మూడో సినిమాను మాత్రం నేల మీదే చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ సినిమాలో కూడా తన మార్క్ కనిపించేలా అంటార్కిటికా మంచులో జరిగే పరిశోదనల నేపథ్యంలో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి