బిగ్‌బాస్‌ వివాదం: గట్స్‌ ఉంటే కామెంట్ చెయ్! | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ వివాదం: మోడల్‌కు నటుడి వార్నింగ్!

Published Sun, Oct 22 2017 5:35 PM

Gauahar Khan warned by Rohan Mehra for Bigg Boss show

ముంబయి: తొలిసారిగా నిర్వహించిన తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సజావుగా సాగింది. దాదాపు అదే సమయంలో ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్‌ షోతో పాటు ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 11 వివాదాలకు కేంద్ర బిందువులుగా మారాయి. ‘నీకు గట్స్‌ ఉంటే ఇంకోసారి బిగ్‌బాస్‌ షో కంటెస్టెంట్ల పేర్లను ట్యాగ్ చేస్తూ కామెంట్ చెయ్.. నీ సంగతి చూస్తానంటూ’  బిగ్‌బాస్‌ సీజన్ 7 విజేత, మోడల్ గౌహర్‌ ఖాన్‌కు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు రోహన్ మెహ్రా వార్నింగ్ ఇచ్చాడు.

అసలు వివాదం ఏంటంటే.. ప్రస్తుత సీజన్లోని కంటెస్టెంట్లలో హీనా ఖాన్‌, ఆకాశ్ డాడ్లానీలున్నారు. ఇటీవల శిల్పా షిండేకు మద్ధతు తెలిపిన గౌహర్‌ ఖాన్‌.. మరో కంటెస్టెంట్ ఆకాశ్‌ను ప్రశంసిస్తూ శుక్రవారం ఎపిసోడ్ తర్వాత ట్వీట్ చేశారు. ‘ఏ-కాశ్, ఆకాశ్ నువ్వు నిజం, నిజాయితీగా ఉన్నావు. నువ్వెవరో కూడా నాకు తెలియదు కానీ బిగ్‌బాస్‌ హౌజ్‌లో చాలాకాలం ఉంటావంటూ’ గౌహర్‌ ఖాన్ ట్వీట్ చేయగా.. బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టంట్‌ దానిపై స్పందించాడు. ఆకాశ్‌ డడ్లానీ ఓవర్‌ కాన్ఫిడెంట్‌ అని హీనాఖాన్‌ అన్నందుకే ట్వీట్ చేశావంటూ గౌహర్‌పై మండిపడ్డాడు రోహన్‌. ఈ క్రమంలో ‘ఆకాశ్‌కు మద్ధతు తెలిపిన గౌహర్‌ ఖాన్.. నీకు గట్స్ ఉంటే మరోసారి ట్వీట్ చేసినప్పుడు హీనాఖాన్‌ పేరును ట్యాగ్ చెయ్ ఏం జరుగుతుందో చూద్దామంటూ’ ట్వీట్ లో వార్నింగ్‌ ఇచ్చాడు రోహన్‌ మెహ్రా.

ఆ ట్వీట్‌పై స్పందించిన గౌహర్‌ వరుస ట్వీట్లు చేస్తూ రోహన్‌కు కౌంటర్ ఇచ్చారు.  మరోసారి తన ట్వీట్లలో ఎవరి పేరునైనా ట్యాగ్ చేస్తానని, తనతో పాటు అభిమానులకు ట్వీట్లు చేయాలని సూచిస్తానని ట్వీట్ చేశారు. ఇందుకోసం నీ పిర్మిషన్ నాకు అక్కర్లేదు. ఇతరులను అసహ్యించుకోవడం ఆపేయాలి. ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పాలంటూ’  రోహన్‌ మెహ్రాకు కౌంటర్ ఇస్తూ వరుస ట్వీట్లు చేశారు గౌహర్‌.

ఇటీవల బిగ్‌బాస్‌ 11 నుంచి ఎలిమినేట్‌ అయిన జుబైర్‌ ఖాన్‌.. ఆ షో హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం దుమారాం రేపింది. థానెలోని అంటాప్‌ హిల్‌ పోలీసు స్టేషన్‌లో ఆయన సల్మాన్‌పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. షో సందర్భంగా సల్మాన్‌ తనను హెచ్చరించడాని జుబైర్‌ తన ఫిర్యాదులో ఆరోపించాడు. అతని ఫిర్యాదు కాపీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement