చిరు చిత్రాలతో గేమ్‌ | games started With chiru films | Sakshi
Sakshi News home page

చిరు చిత్రాలతో గేమ్‌

Feb 7 2017 11:08 PM | Updated on Sep 5 2017 3:09 AM

చిరు చిత్రాలతో గేమ్‌

చిరు చిత్రాలతో గేమ్‌

చిరంజీవి నటించిన 150 చిత్రాల్లో ప్రతి చిత్రాన్నీ ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో రూపొందించిన గే

చిరంజీవి నటించిన 150 చిత్రాల్లో ప్రతి చిత్రాన్నీ ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో రూపొందించిన గేమ్‌ ‘మెగా 150–బాస్‌ ఇన్‌ గేమ్‌’. చిరంజీవి అభిమా నులు సతీశ్‌బాబు ముత్యాల, ప్రసాద్‌ బొలిశెట్టి, పవన్‌ కొర్లపాటి, శేషు లొశెట్టి స్థాపించిన ‘ఎం యాప్‌ సోర్స్‌ డెవలప్‌మెంట్‌’ కంపెనీ ఈ గేమ్‌ని రూపొందించింది. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత ‘దిల్‌’ రాజులు హైదరాబాద్‌లో ఈ గేమ్‌ని విడుదల చేశారు. ఈ గేమ్‌ రూపకర్తలు మాట్లాడుతూ –‘‘ఈ గేమ్‌లో 14 లెవల్స్‌ ఉంటాయి.

రెండు వాల్యూమ్స్‌ కింద విడుదల చేస్తున్నాం. చిరంజీవిగారి 110 చిత్రాలను మొదటి వాల్యూమ్‌లో, మిగతా 40 చిత్రాలను రెండో వాల్యూమ్‌లో క్రియేట్‌ చేశాం. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈ గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు’’ అన్నారు. అభిమానులు రూపొందించిన ఈ గేమ్‌ సక్సెస్‌ కావాలని వీవీ వినాయక్, ‘దిల్‌’రాజు ఆకాంక్షించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement