మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌.. | Galla Ashok Look Revealed From His First movie | Sakshi
Sakshi News home page

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

Apr 5 2020 6:48 PM | Updated on Apr 5 2020 6:49 PM

Galla Ashok Look Revealed From His First movie - Sakshi

హీరో మహేష్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేశవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో.. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఆదివారం అశోక్‌ పుట్టిన సందర్భంగా ఈ చిత్రంలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. టేబుల్‌పై కూర్చొని ల్యాంప్ వెలుగులో  పుస్త‌కం చ‌దువుతున్న అశోక్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. 

ఈ సందర్భంగా నిర్మాత ప‌ద్మావ‌తి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అంద‌రూ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు. ప్ర‌భుత్వాలు, డాక్ట‌ర్లు, పోలీసులు చెబుతున్న స‌ల‌హాలు, సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కట్టడిలో భాగ‌స్వాములు కావాల‌న్నారు. ఇంకా ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ 50 శాతం పూరైనట్టుగా చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో  సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement