కాపీ అయినా సరిగా చేయండి : ఫ్రెంచ్‌ డైరెక్టర్‌ | French Director Accuses Saaho Team of Copying Largo Winch | Sakshi
Sakshi News home page

కాపీ అయినా సరిగా చేయండి : ఫ్రెంచ్‌ డైరెక్టర్‌

Sep 3 2019 10:40 AM | Updated on Sep 3 2019 10:53 AM

French Director Accuses Saaho Team of Copying Largo Winch - Sakshi

ఇటీవల కాలంలో సినిమాల మీద కాపీ ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మన దర్శకులు ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌ సినిమాలను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యదాతథంగా ఫ్రీమేక్‌ (అనుమతులు లేకుండా రీమేక్‌) చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా సాహో సినిమా విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఏకంగా ఫ్రెంచ్‌ దర్శకుడు జెరోమ్‌ సల్లే సాహోను ఉద్దేశిస్తూ తన సినిమాను మరోసారి ఫ్రీమేక్‌ చేవారంటూ ట్వీట్‌ చేశాడు.

గతంలో అజ్ఞాతవాసి సినిమాను జెరోమ్‌ తెరకెక్కించిన లార్గో వించ్‌ సినిమా ఆధారంగా తెరకెక్కించారన్న ఆరోపణలు వినిపించాయి. కథతో పాటు కథనం కూడా యదాతథంగా ఉండటంతో అప్పట్లో జెరోమ్‌కు పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. తాజాగా సాహో కథనం ట్రీట్మెంట్‌ భిన్నంగా ఉన్నా.. మూల కథ దాదాపు లార్గో వించ్‌ను పోలి ఉండటంతో మరోసారి జెరోమ్ స్పందించారు.

తన సినిమాను కాపీ చేసి తెరకెక్కించిన రెండు సినిమాలకు నెగెటివ్‌ రావటంతో కనీసం కాపీ అయినా సరిగా చేయండి అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు జెరోమ్‌. అంతేకాదు ఇండియాలో తన కెరీర్‌ చాలా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందన్నాడు జెరోమ్‌. అయితే టాక్‌ ఎలా ఉన్న ప్రభాస్‌ సాహో మాత్రం కలెక్షన్ల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ దిశగా దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement