కోలీవుడ్‌కు ఫ్రాన్స్ బ్యూటీ | France Beauty act in Kollywood movie | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు ఫ్రాన్స్ బ్యూటీ

Jul 29 2016 2:00 AM | Updated on Sep 4 2017 6:46 AM

కోలీవుడ్‌కు ఫ్రాన్స్ బ్యూటీ

కోలీవుడ్‌కు ఫ్రాన్స్ బ్యూటీ

స్వదేశీ భామలే కాదు విదేశీ బ్యూటీలు కోలీవుడ్‌లో నటించడానికి అసక్తి చూపడం విశేషం. తమిళ చిత్రపరిశ్రమలో మాలీవుడ్,

స్వదేశీ భామలే కాదు విదేశీ బ్యూటీలు కోలీవుడ్‌లో నటించడానికి అసక్తి చూపడం విశేషం. తమిళ చిత్రపరిశ్రమలో మాలీవుడ్, బాలీవుడ్ ముద్దుగుమ్మల హవానే సాగుతుందన్నది వాస్తవం. అలాంటిది మదరాసు పట్టణం చిత్రం ద్వారా బ్రిటీష్ బ్యూటీ ఎమీజాక్సన్ రంగప్రవేశం చేసి తనదైన అందాలతో తమిళ ప్రేక్షకుల ఆదరణను చూరగొంటోంది. తాజాగా ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆండ్రిన్ అనే భామ కోలీవుడ్‌లో పాగా వేయడానికి సిద్ధమైంది.
 
 ఈమె నటిస్తున్న తమిళ చిత్రం మేల్‌నాట్టు మరుమగన్. రాజ్‌కమల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయా క్రియేషన్స్ పతాకం మనో ఉదయకుమార్ నిర్మిస్తున్నారు. వీఎస్.రాఘవన్, అంజలిదేవి, అశోకరాజ్, శాంతయ్య ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని ఎంఎస్‌ఎస్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ డబ్బు, పేరు, ప్రేమ ఇలా ఒక్కో మనిషికి ఒక్కో ఆశ ఉంటుందన్నారు.
 
  అలాగే ఈ చిత్ర కథానాయకుడికి విదేశీ యువతిని ప్రేమించి, పెళ్లాడి విదేశాల్లో సెటిల్ అవ్వాలన్నదే లక్ష్యంగా ఉంటుందన్నారు. అయితే డబ్బు ఏ దేశంలో నైనా సంపాదించుకోవచ్చుగానీ, ప్రేమ, పెళ్లి విషయానికి వచ్చే సరికి సంస్కృతి, సంప్రదాయాల్లో మన దేశానికి మించిన దేశం లేదన్నారు. ఇలా ఉండగా ఈ చిత్రం కథానాయకుడి లక్ష్యం నెరవేరిందా? లేదా? అన్నదే మేల్ నాట్టు మరుమగన్ చిత్రంలో ప్రధానాంశం అన్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణను త్వరలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement