రంగస్థలం ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ వాయిదా! | First look of Rangasthalam to be released on December 8 | Sakshi
Sakshi News home page

9న రంగస్థలం ఫస్ట్‌లుక్‌

Dec 7 2017 6:41 PM | Updated on Dec 7 2017 6:50 PM

First look of Rangasthalam to be released on December 8 - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం రంగస్థలం 1985. సినిమా షూటింగ్‌ లోకేషన్లు, సెట్‌ల వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో రామ్‌చరణ్‌ అప్‌డేట్‌ ఇస్తూనే ఉంటారు. అయితే సినిమా విడుదలకు సంబంధించిన విషయాల్లో చరణ్‌తో పాటు చిత్ర బృందం గోప్యత పాటిస్తూ వస్తున్నారు. దీంతో మెగా అభిమానుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అయితే వారిని కూల్‌ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా ఓప్రకటన విడుదల చేసింది.

రంగస్థలం 1985 ఫస్ట్‌లుక్‌ను మొదట డిసెంబర్‌ 8 సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించినా తర్వాత వాయిదా వేసింది. డిసెంబర్‌ 9 (శనివారం) ఉదయం 9గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనిపై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. పీరియడిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, వైభవ్‌, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇంక సినిమా విషయానికి వస్తే 1985 కాలం నాటి వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం కోసం సుకుమార్‌ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ జరుపుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement