ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు వీరే.. | Sakshi
Sakshi News home page

ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు వీరే..

Published Sun, Jul 13 2014 4:50 PM

film fare award winners

చూడ్డానికి కళ్లు సరిపోవేమో అనేంత అందంగా ఉన్న వేదికపై ఉల్లాసం, ఉత్తేజానిచ్చే ఆట-పాటలు కలగలిసి కళ్లు తిప్పుకోనివ్వని అందాలు,మిరమిట్లు గొలిపే మెరుపులు. ఇక చివరగా.. కళ్లింత చేసి, ఉత్కంఠగా చూస్తుండగా 'ద అవార్డ్ గోస్ టూ..' అనే సందర్భంలో ఏర్పడే నిశ్శబ్ధం.. వీటన్నింటికీ వేదికైంది 'ఫిల్మ్‌ఫేర్ అవార్డ్- 2013' వేడుక.

చిత్రపరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత, ఆస్థాయి పేరు గాంచిన ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఫిల్మ్‌ఫేర్. ప్రతీ యేటా హిందీ చిత్రాలకు, దక్షిణ భారత దేశంలోని వివిధ పరిశ్రమలకు వేర్వేరుగా ప్రకటించే ఈ అవార్డుల్లో.. 2013 సంవత్సరానికి హిందీ పరిశ్రమకు సంబంధించిన అవార్డు వేడుకను జనవరి నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ భారత చలనచిత్రాలకు సంబంధించిన అవార్డు వేడుకను నిన్న (12-07-2013) న చెన్నైలో నిర్వహించారు.

ఈ అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు గానూ, 2013లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అత్తారింటికి దారేదీ' నాలుగు అవార్డులను సొంతం చేసుకోగా.. అదే సంవత్సరం విడుదలై మల్టీస్టారర్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'  రెండు అవార్డులను ఎగరేసుకెళ్లింది.

తెలుగు పరిశ్రమకు చెందిన అవార్డుల విశేషాలివీ..

ఉత్తమ చిత్రం : అత్తారింటికి దారేదీ
ఉత్తమ నటుడు : మహేశ్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ దర్శకుడు : త్రివిక్రమ్ (అత్తారింటికి దారేదీ)
ఉత్తమ నటి : నిత్యామీనన్ (గుండెజారి గల్లంతయిందే)
ఉత్తమ సహాయ నటుడు : సునీల్ (తడాఖా)
ఉత్తమ సహాయ నటి : మంచు లక్ష్మి(గుండెల్లో గోదారి)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేదీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు : కైలాష్ కేర్ (పండగలా దిగివచ్చావు.. మిర్చి)
ఉత్తమ నేపథ్య గాయని : చిత్ర (సీతమ్మ వాకిట్లో.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ గీత రచయిత : శ్రీమణి (ఆరడుగుల బుల్లెట్.. అత్తారింటికి దారేదీ)

మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి

In English: Mahesh Babu wins Filmfare best actor south award

Advertisement
Advertisement