Seethamma Vakitlo Sirimalle Chettu
-
SVSC Re-Release: థియేటర్స్‌లో అమ్మాయిల డ్యాన్స్.. వీడియో వైరల్
మహేశ్ బాబు, వెంకటేశ్ పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. 2013లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా దర్శకుడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేశాడు నిర్మాత దిల్ రాజు. మార్చి 7న రీరిలీజైన ఈ చిత్రానికి మహేశ్, వెంకీల ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. విజయవాడలోని ఓ థియేటర్లో ఈ సినిమాలోని పెళ్లి సీన్‌ను రీ క్రియేట్ చేశారు. అలాగే పలు చోట్ల ఈ సినిమాలోని ‘ఆరడుగులుంటాడా’ పాటకి అమ్మాయిలు రెచ్చిపోయి చిందులేశారు. థియేటర్స్‌లో ఆ పాట రాగానే సమంత వేసే స్టెప్పులను అమ్మాయిలు అదే విధంగా అచ్చదించేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మహేశ్ తెరపై కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్ ఈలలు వేశారు. పూల కుండి సీన్‌ని కూడా థియేటర్స్‌లో రీక్రియేట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. Her dance 🔥#SVSCReRelease pic.twitter.com/Fb4AxT9rGB— Sun 🌞 Deep 🪔 (@sandyp_tweets) March 8, 2025TFI Banisalu In USA ♥️🔥 pic.twitter.com/IYrqdH0nRH— Naveen MB Vizag (@NaveenMBVizag) March 8, 2025All Theaters Controlled Under Lady DHFM's✅🔥 pic.twitter.com/mIts8H8O94— Naveen MB Vizag (@NaveenMBVizag) March 7, 2025Perfect Sync ✅ pic.twitter.com/cshwSWZHrp— Naveen MB Vizag (@NaveenMBVizag) March 8, 2025Perfect On & Off Screen Steps By Lady DHFM🤩🔥 pic.twitter.com/y6he1jFton— Naveen MB Vizag (@NaveenMBVizag) March 7, 2025Poola Kundi Recreation!😂🔥 pic.twitter.com/QkKfNV6cSI— Naveen MB Vizag (@NaveenMBVizag) March 8, 2025Age Is Just A Number!Family Audiences Shows Love Towards @urstrulyMahesh ♥️🔥 pic.twitter.com/rIzDHLMLdH— Naveen MB Vizag (@NaveenMBVizag) March 7, 2025 -
రీరిలీజ్ సినిమాకి 10 థియేటర్స్ ఫుల్!
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాసిక్ బ్లాక్ బస్టర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'( Seethamma Vakitlo Sirimalle Chettu). శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు(Dil Raju) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని మార్చి 7న గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రీరిలీజ్ కోసం మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు వెంకీ మామ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వెంకీ, మహేశ్‌ల బ్రో కెమిస్ట్రీని మళ్లీ థియేటర్స్‌లోనే చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 10 థియేటర్స్‌లో ఫుల్ అయిపోయాయట. రీరిలీజ్‌కి ఈ స్థాయిలో టికెట్స్ బుక్ కావడం రికార్డు అంటున్నాడు దిల్ రాజు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..మార్చి7 శుక్రవారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ చేస్తున్నాం. తొలిప్రేమ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఐదేళ్ళు సినిమా రైట్స్ మా వద్ద ఉండేవి. మాకు ఎప్పుడు డబ్బులు తక్కువ ఉన్న సినిమాని రీరిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేవి. అవన్నీ మిరాకిల్స్ డేస్. అలాగే ఇప్పుడు కూడా రీరిలీజ్ పెడితే ఆడియన్స్ చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీరిలీజ్ కి సంబధించి అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆల్రెడీ ఓటీటీ లో ఉంది. జనం చుసేశారు. అయినప్పటికీ మళ్ళీ థియేటర్స్ కి వస్తున్నారంటే.. మంచి కంటెంట్ మళ్ళీ చూద్దామని వస్తున్నారు. మహేష్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు థియేటర్ కి వచ్చి మళ్ళీ బ్రదర్స్ మధ్య వుండే మూమెంట్స్ ని మళ్ళీఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్స్ ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా వుంది. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారని రీరిలీజ్ లు ప్రూవ్ చేస్తున్నాయి. ఆంద్రలో డే వన్ అరవై డెబ్బై శాతం అడ్వాన్స్ బుకింగ్స్ వున్నాయి. ఫ్రైడేకి అవి ఫుల్స్ అయిపోతాయి. సుదర్శన్ 35ఎంఎం సెకండ్ డే కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి. రీరిలీజ్ హ్యాపీనెస్ ఈ సినిమా ద్వారా కనిపిస్తోంది. నేనూ వెళ్లి మార్చి 7న సుదర్శన్ 35ఎంఎం లో మార్నింగ్ ఎనిమిది గంట షో చూస్తాను. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తోంది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి'అన్నారు. -
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీరిలీజ్ ట్రైలర్ విడుదల
టాలీవుడ్లో చాలా ఏళ్ల తర్వాత మల్టీస్టారర్ మూవీగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ 2013లో విడుదలైంది. అయితే, సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ మూవీ మార్చి 7న రీరిలీజ్ కానున్నడంతో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ అడ్డాల కథతో పాటు దర్శకత్వం వహించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.వెంకటేష్, మహేష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి చేసిన సినిమా కావడంతో అప్పుట్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా ఏళ్ల తర్వాత మల్టీస్టారర్ ట్రెండ్‌కు ఈ మూవీ కొత్త ఊపిరిపోసింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 55 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో సీతగా అంజలి పాత్ర ప్రధానంగా హైలెట్ అయిందని చెప్పవచ్చు.‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రధాన విశేశాలుఈ చిత్రంలో వెంకటేష్, మహేశ్ బాబు అన్నదమ్ములుగా అదరగొట్టేశారు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటించారు. వీరికి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్, అమ్మ పాత్రలో జయసుధ మెప్పించారు. అమ్మమ్మ పాత్రలో ప్రముఖ హిందీ నటి రోహిణీ హట్టంగడి కనిపించారు.ఇందులో మహేశ్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.అప్పటిదాకా ప్రముఖ గాయని చిన్మయిచే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకున్న సమంత ఈ చిత్రం నుంచి తనే తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.దాదాపు 20 ఏళ్ల తర్వాత నిర్మించబడిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల కలెక్షన్లను సాధించింది. మగధీర (2009), దూకుడు (2011), గబ్బర్ సింగ్ (2012) తర్వాత ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది.ఈ చిత్రం 4 నంది అవార్డులను సొంతం చేసుకుంది.ఉత్తమ కుటుంబ కథా చిత్రంతో పాటు ఉత్తమ సహాయ నటుడు (ప్రకాష్ రాజ్), ఉత్తమ గేయ రచయిత (సిరివెన్నెల సీతారామశాస్త్రి-మరీ అంతగా), ప్రత్యేక బహుమతి (అంజలి) నంది అవార్డ్స్ అందుకున్నారు.2013 సైమా అవార్డ్స్: ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ గీత రచయిత (అనంత శ్రీరామ్ -సీతమ్మ వాకిట్లో) -
టాలీవుడ్లో ఇప్పుడదే ట్రెండ్.. చిన్నోడు.. పెద్దోడు.. మళ్లీ వచ్చేస్తున్నారు..!
టాలీవుడ్ ప్రియులను అలరించిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందు వరుసలో ఉంటుంది. విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మించారు. 2013లో సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సినీ ప్రియులను మెప్పించింది.తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ టాలీవుడ్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు థియేటర్లలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనతో వెంకటేశ్, మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. The wait is over! 🎬✨Relive the magic of family, love, and brotherhood with Peddhodu @VenkyMama & Chinnodu @urstrulyMahesh 🙌Catch the timeless classic #SeethammaVakitloSirimalleChettu in theatres on March 7th❤️🔥Get Ready to experience the nostalgia once again🔥… pic.twitter.com/mYD1RZvvnI— Sri Venkateswara Creations (@SVC_official) February 21, 2025 -
సీతమ్మవాకిట్లో..' సీక్వెల్ ఎప్పుడో తేలిపోయింది..!
-
కోలీవుడ్‌కు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
తమిళసినిమా: చాలా కాలం తరువాత టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ అయిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నటుడు వెంకటేశ్, మహేశ్‌బాబు కలిసి నటించిన ఇందులో సమంత, అంజలి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, అభినయ, రావురమేశ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి అడ్డాల శ్రీకాంత్ దర్శకుడు. మిక్కీ జే.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు మంచి ఆదరణ పొందాయి. చక్కని కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మోయిన్ బేగ్ సమర్పణలో రోల్స్ బ్రైట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మెహబూబ్‌బాషా నెంజమెల్లాం పల వణ్ణం పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు. దీనికి ఏఆర్కే.రాజరాజా అనువాదం రచయితగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని వివరాలను ఆయన తెలుపుతూ తెలుగు చిత్రం అనగానే ఫైట్స్, యాక్షన్, ఫాస్ట్ బీట్తో కూడిన పాటలు అనుకుంటారన్నారు. అయితే నెంజమెల్లాం పల వణ్ణం చిత్రం చక్కని కుటుంబ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. మహేశ్‌బాబు, వెంకటేశ్ అన్నదమ్ములుగా నటించారని చెప్పారు. కడైకుట్టి సింగం తరహాలో ఈ చిత్రంలో మహేశ్‌బాబు కడైకుట్టి సింగం పాత్రలో నటించారని తెలిపారు. ఈయన ఇంతకు ముందు నటించిన శ్రీమంతుడు చిత్రం తమిళంలో సెల్వందన్ పేరుతో అనువాదం అయ్యి మంచి సక్సెస్ అయ్యిందన్నారు. అదే మాదిరిగా ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని అన్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏఆర్కే.రాజరాజా తెలిపారు. -
నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నా
హైదరాబాద్ : ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న శ్రీమంతుడు చిత్రంలో తనకు ఛాన్స్ రావడం పట్ల హైదరాబాదీ అమ్మాయి తేజస్వీ మాదివాడ ఉబ్బితబ్బిబవుతోంది. ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. మహేశ్‌తో కలసి నటించడం చాలా ఆనందంగా ఉంటుందని తేజస్వి చెప్పింది. నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నానంటుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టులో వలేనే శ్రీమంతుడు చిత్రంలో కూడా చిన్న పాత్రే ... కాకుంటే చాలా ఆసక్తితో కూడిన పాత్ర అని తేజస్వి వెల్లడించింది. ఇంతకీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించిన తేజస్వీ గుర్తుందా ? లేదా అయితే... ఆ చిత్రంలో మహేశ్ బాబు విజయవాడ వాళ్ల వివాహానికి వెళ్తాడు... అక్కడ మహేశ్ బాబును భోజనానికి తీసుకు వెళ్తుంది కదా ఆ అమ్మాయే. ఇంకా గుర్తు రాలేదా? నాకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ... ఈ మధ్య సపరేట్ బ్యాచ్‌ని కూడా మెయింటేన్ చేస్తున్నా అంటూ మహేశ్ బాబుతో చెప్పే అమ్మాయి. ఇప్పుడు గుర్తుకు వచ్చే ఉంటుంది. -
మహేశ్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల చిత్రం
చెన్నై: ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఆ చిత్రానికి సంబంధించిన కథ ఇప్పటికే మహేశ్ బాబుకు చంటి అడ్డాల వినిపించారు. ఆ చిత్రంలో నటించేందుకు మహేష్ అంగీకరించారు. కానీ ప్రస్తుతం తాను పలు చిత్రాలలో నటిస్తు బిజీగా ఉన్నానని ఆ చిత్రాలు పూర్తి అయిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభించాలని శ్రీకాంత్ అడ్డాలను మహేశ్ బాబు కోరారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. అయితే మహేశ్ హీరోగా ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రంలో మహేష్ బాబు నటించనున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ హీరో వెంకటేష్, ప్రిన్స్ మహేశ్ బాబు హీరోలుగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. -
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు వీరే..
చూడ్డానికి కళ్లు సరిపోవేమో అనేంత అందంగా ఉన్న వేదికపై ఉల్లాసం, ఉత్తేజానిచ్చే ఆట-పాటలు కలగలిసి కళ్లు తిప్పుకోనివ్వని అందాలు,మిరమిట్లు గొలిపే మెరుపులు. ఇక చివరగా.. కళ్లింత చేసి, ఉత్కంఠగా చూస్తుండగా 'ద అవార్డ్ గోస్ టూ..' అనే సందర్భంలో ఏర్పడే నిశ్శబ్ధం.. వీటన్నింటికీ వేదికైంది 'ఫిల్మ్‌ఫేర్ అవార్డ్- 2013' వేడుక. చిత్రపరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత, ఆస్థాయి పేరు గాంచిన ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఫిల్మ్‌ఫేర్. ప్రతీ యేటా హిందీ చిత్రాలకు, దక్షిణ భారత దేశంలోని వివిధ పరిశ్రమలకు వేర్వేరుగా ప్రకటించే ఈ అవార్డుల్లో.. 2013 సంవత్సరానికి హిందీ పరిశ్రమకు సంబంధించిన అవార్డు వేడుకను జనవరి నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ భారత చలనచిత్రాలకు సంబంధించిన అవార్డు వేడుకను నిన్న (12-07-2013) న చెన్నైలో నిర్వహించారు. ఈ అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు గానూ, 2013లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అత్తారింటికి దారేదీ' నాలుగు అవార్డులను సొంతం చేసుకోగా.. అదే సంవత్సరం విడుదలై మల్టీస్టారర్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రెండు అవార్డులను ఎగరేసుకెళ్లింది. తెలుగు పరిశ్రమకు చెందిన అవార్డుల విశేషాలివీ.. ఉత్తమ చిత్రం : అత్తారింటికి దారేదీ ఉత్తమ నటుడు : మహేశ్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఉత్తమ దర్శకుడు : త్రివిక్రమ్ (అత్తారింటికి దారేదీ) ఉత్తమ నటి : నిత్యామీనన్ (గుండెజారి గల్లంతయిందే) ఉత్తమ సహాయ నటుడు : సునీల్ (తడాఖా) ఉత్తమ సహాయ నటి : మంచు లక్ష్మి(గుండెల్లో గోదారి) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేదీ) ఉత్తమ నేపథ్య గాయకుడు : కైలాష్ కేర్ (పండగలా దిగివచ్చావు.. మిర్చి) ఉత్తమ నేపథ్య గాయని : చిత్ర (సీతమ్మ వాకిట్లో.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఉత్తమ గీత రచయిత : శ్రీమణి (ఆరడుగుల బుల్లెట్.. అత్తారింటికి దారేదీ) మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి In English: Mahesh Babu wins Filmfare best actor south award -
రికార్డులున్నా... అసంతృప్తే!
174 డెరైక్ట్ చిత్రాలు... కానీ విజయాలు మాత్రం పదిహేనే. 2013లో డిసెంబర్ 24 వరకూ మన చిత్రసీమ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. అంకెల పరంగా చూస్తే ఓకే గానీ, విజయాల పరంగా మాత్రం వీకే. ఈ విజయాలు ఏ మాత్రం బాక్సాఫీస్ దప్పికను తీర్చలేవనేది కరాఖండీగా చెప్పేయొచ్చును. మన తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్‌కు (గ్రాస్ పరంగా) చేరుకోవడమనేది 2013లో ఓ గొప్ప విజయం. దాంతోపాటు మరో నాలుగు సినిమాలు 50 కోట్ల మైలురాళ్లను (షేర్ పరంగా) అందుకోవడం మరో తీయటి అనుభూతి. చాలామట్టుకు సినిమాలను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. కంటెంట్ లేకపోతే ఒక్క టిక్కెట్ కూడా తెగడంలేదనేది కాదనలేని వాస్తవం. రికార్డులను చూసి ఆనందపడాలో, పరాజయాలను తల్చుకుని కుమిలిపోవాలో తెలియని అసందిగ్ధావస్థ ఇది. విజయాలు సాధించిన సినిమాలను విశ్లేషించి చూస్తే, కుటుంబ కథాచిత్రాలకు మళ్లీ ఆదరణ మొదలైందని అర్థమవుతోంది. అందుకు నిదర్శనం ‘అత్తారింటికి దారేది’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రాల ఘనవిజయాలే. మరో పక్క మాస్ ఎంటర్టైనర్లకూ ప్రేక్షకులు పట్టం కట్టారు. కుటుంబ కథ, ప్రేమకథ, మాస్ మసాలా, చివరకు హారర్ స్టోరీ అయినా వినోదం ఉండి తీరాల్సిందే. అలా అయితేనే ప్రేక్షకుడు సినిమాకి వస్తున్నాడు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉదృతంగా జరిగిన తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు చిత్రసీమపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. చాలా సినిమాల విడుదలలు వెనక్కి ముందుకి ఊగిసలాడాల్సిన పరిస్థితి. ఒక దశలో పెద్ద సినిమాలన్నీ విడుదలకు వెనుకంజ వేస్తే... వారానికి అయిదారు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే.. ఇవన్నీ ఎంత త్వరగా వచ్చాయో... అంతే త్వరగా వెళ్లిపోయాయి. ఈ ఏడాది విజయతీరానికి చేరుకున్న 15 సినిమాలేంటో ఒకసారి చూద్దాం... బ్లాక్‌బస్టర్ ఆఫ్‌ది ఇయర్: సినిమా రిలీజ్‌కి రెడీ. కానీ ఈ లోగా రాష్ట్రంలోని ఉద్యమం ఊపందుకుంది. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. జూలైలో అనుకున్న సినిమా సెప్టెంబర్ వరకూ సెలైంట్‌గా ఉండిపోవాల్సివచ్చింది. ఈ లోగా ఓ పిడుగులాంటి వార్త. బాక్సాఫీస్‌కి గుండెపోటు తెప్పించే వార్త. ఈ సినిమా ప్రథమార్ధం అంతా ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. దానికి తోడు అనేక పైరసీ ప్రింట్లు. ఇక ఈ సినిమా పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. అయినా మొండిగా సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేశారు. కట్ చేస్తే... ‘అత్తారింటికి దారేది’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇన్ని అవరోధాలను దాటుకొని ఇంతటి ఘనవిజయం సాధించడమంటే... మాటలు కాదు. ఇది పవన్‌కల్యాణ్ మ్యాజిక్. దర్శకుడు త్రివిక్రమ్ మ్యాజిక్. వంద కోట్ల రూపాయల పై చిలుకు గ్రాస్నీ, 80 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసి తెలుగు సినిమా స్టామినాను బాక్సాఫీస్‌కి చాటిచెప్పింది. ‘గబ్బర్‌సింగ్’తో ఫామ్‌లోకొచ్చిన పవన్‌ని నంబర్‌వన్ రేస్‌లో ముందుండేలా చేసింది. కుటుంబ కథలు కనుమరుగైపోయిన నేటి తరుణంలో పవన్ ఈ కథను ఎంచుకొని మళ్లీ కొత్త ట్రెండ్‌కి నాంది పలికారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఓ సంచలనం. అత్త పాత్రలో నదియా కూడా పెద్ద ప్లస్. నాయక్(జనవరి 9) ఈ ఏడాదికి ఇదే తొలి హిట్. మాస్ అంశాలే ఈ సినిమాకు శ్రీరామరక్ష. ‘రచ్చ’ తర్వాత చరణ్‌కి ఇది మరో మాస్ హిట్. 50 కోట్ల పైచిలుకు షేర్ వసూలు చేసింది. చరణ్, వినాయక్ కాంబినేషన్ మాస్‌ని ఆకట్టుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు(జనవరి 11) వెంకటేష్, మహేష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి చేసిన సినిమా. అదీ కుటుంబ కథ కావడం విశేషం. క్లీన్ మూవీ. అనుబంధాలు, అలకలు, అల్లర్లు, కోనసీమ అందాలు ప్రేక్షకుల మనసు నిండేలా చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అందుకేనేమో 50 కోట్ట పైచిలుకు షేర్ రాబట్టగలిగింది. ఓవర్సీస్లో కొత్త రికార్డ్ సృష్టించింది. మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్‌కి కొత్త ఊపిరిచ్చింది. మిర్చి(ఫిబ్రవరి 8) ఫ్యామిలీ డ్రామాకు ఫ్యాక్షన్ కలగలిపితే వచ్చిన ఘాటైన సినిమా ఇది. ఈ సినిమాతో ప్రభాస్ మాస్‌కి మరింత చేరువయ్యారు. రచయిత కొరటాల శివ దర్శకునిగా మెప్పించారు. ఈ సినిమా కూడా 50 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టుకుంది. స్వామి రారా( మార్చి 23) కొత్త కాన్సెప్ట్‌తో కొత్తగా తీస్తే... చిన్న సినిమా అయినా పెద్ద రేంజ్లో ఆడుతుంది అనడానికి స్వామి రారా ఓ అందమైన నిదర్శనం. కొత్త దర్శకుడు సుధీర్‌వర్మ ఈ సినిమాను డీల్ చేసిన విధానమే మెయిన్ హైలైట్. బాద్షా(ఏప్రిల్ 5) ఈ ఏడాది యాభై కోట్ల పై చిలుకు షేర్ వసూలు చేసిన సినిమాల్లో ‘బాద్షా’ ఒకటి. ఊసరవెల్లి, దమ్ము చిత్రాలతో పోల్చుకుంటే... ఎన్టీఆర్‌కి ఇది మంచి ఊరట. శ్రీనువైట్ల శైలి ఈ సినిమాకు కలిసొచ్చింది. గుండెజారి గల్లంతయ్యిందే(ఏప్రిల్ 19) చాలాకాలం తర్వాత వచ్చిన క్లీన్ అండ్ కలర్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. నితిన్, నిత్యామీనన్ల కెమిస్ట్రీ మరోసారి అదిరింది. అనూప్ మ్యూజిక్ మ్యాజిక్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. దర్శకుడు విజయ్‌కుమార్ కొండా ప్రయత్నం ఫలించింది. తడాఖా(మే 10) తమిళ ‘వేట్టై’కి రీమేక్ ఇది. సునీల్, నాగచైతన్య కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. నాగచైతన్యకు మాస్ ఇమేజ్ జతకూడింది. డాలీ ఈ రీమేక్‌ని బాగా డీల్ చేశారు. ప్రేమకథాచిత్రమ్ (జూన్ 9) హారర్ సినిమా చూసి ఎవరైనా భయపడతారు. కానీ హారర్‌తో కూడా పొట్టచెక్కలయ్యేంత కామెడీ సృష్టించొచ్చని ‘ప్రేమ కథాచిత్రమ్’ నిరూపించింది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో కెమెరామేన్ ప్రభాకరరెడ్డి డెరైక్ట్ చేశారీ సినిమా. ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం ఇదే. సుధీర్‌బాబుని హీరోగా నిలబెట్టింది. బలుపు(జూన్ 28) రెండేళ్ల దోబూచులాట తర్వాత రవితేజకు ‘బలుపు’తో విజయం దక్కింది. పంచ్ డైలాగులు బాగా పండాయ్. పెరిగిన టికెట్ రేట్లను బాగా సద్వినియోగం చేసుకోగలిగిందీ సినిమా. అంతకు ముందు ఆ తరువాత(ఆగస్ట్ 23) సహజీవనం అనేది కత్తిమీద సాములాంటి కాన్సెప్ట్. ఏ మాత్రం అటూఇటూ అయినా... చాలా తేడా వస్తుంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ చాలా తెలివిగా ఈ సినిమాను మలిచారు. సుమంత్ అశ్విన్‌కి హీరోగా ఓ మంచి బ్రేక్. దామూకి నిర్మాతగా వేల్యూ పెంచింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (నవంబర్ 29) ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా. కొత్త దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా ఇన్నోవేటివ్‌గా ఈ కథను తెరకెక్కించాడు. సందీప్‌కిషన్‌కి సోలో హీరోగా తొలి విజయం. మంచు మనోజ్ కెరీర్లోనే భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ‘పోటుగాడు’. మేకింగ్ దశలోనే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఫలితంగా ప్రారంభ వసూళ్లు ఆకర్షణీయంగా వచ్చాయి. చాలా విరామం తర్వాత గోపిచంద్ చేసిన ‘సాహసం’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచింది. ఆయన స్థాయి విజయం కాకపోయినా... రన్ మాత్రం బాగానే వచ్చింది. ‘అడ్డా’ సినిమా కూడా సెలైంట్‌గా వసూళ్లు రాబట్టింది. సుశాంత్‌కి ఓ విధంగా ఇదే తొలి విజయం.