SVSC Re-Release: థియేటర్స్‌లో అమ్మాయిల డ్యాన్స్‌.. వీడియో వైరల్‌ | SVSC Re-Release: Girls Dance Video Goes Viral | Sakshi
Sakshi News home page

SVSC Re-Release: థియేటర్స్‌లో అమ్మాయిల డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Mar 8 2025 4:35 PM | Updated on Mar 8 2025 4:47 PM

SVSC Re-Release: Girls Dance Video Goes Viral

 మహేశ్‌ బాబు, వెంకటేశ్‌ పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. 2013లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమా దర్శకుడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ రిలీజ్‌ చేశాడు నిర్మాత దిల్‌ రాజు. మార్చి 7న రీరిలీజైన ఈ చిత్రానికి మహేశ్‌, వెంకీల ఫ్యాన్స్‌ బ్రహ్మరథం పట్టారు. 

విజయవాడలోని ఓ థియేటర్‌లో ఈ సినిమాలోని పెళ్లి సీన్‌ను రీ క్రియేట్‌ చేశారు. అలాగే పలు చోట్ల ఈ సినిమాలోని ‘ఆరడుగులుంటాడా’ పాటకి అమ్మాయిలు రెచ్చిపోయి చిందులేశారు. థియేటర్స్‌లో ఆ పాట రాగానే సమంత వేసే స్టెప్పులను అమ్మాయిలు అదే విధంగా అచ్చదించేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మహేశ్‌ తెరపై కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్‌ ఈలలు వేశారు. పూల కుండి సీన్‌ని కూడా థియేటర్స్‌లో రీక్రియేట్‌ చేసి సెలెబ్రేట్‌ చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement