అదేంటి.. ఆ నటి కనుబొమ్మపై గాటు! | Fatima Sana Shaikh spotted at restaurant | Sakshi
Sakshi News home page

Apr 8 2018 8:00 PM | Updated on Apr 8 2018 8:02 PM

Fatima Sana Shaikh spotted at restaurant  - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌తో వరుస సినిమాలు చేస్తున్న భామ సనా ఫాతిమా షైక్‌. ‘దంగల్‌’ లో రెజ్లర్‌ గీతా ఫొగట్‌గా నటించి మెప్పించిన ఈ అమ్మడు తాజాగా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ సినిమాలో నటిస్తోంది. ఆమిర్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌ వంటి ప్రముఖ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సనా తాజాగా ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌ వద్ద దర్శనమిచ్చింది. సీరియస్‌గా పుస్తకం చదువుతూ కనిపించిన ఈ అమ్మడిని ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. అదేంటి ఆమె కనుబొమ్మ ఒకటి అలా ఉంది అని ఆరా తీస్తున్నారు. ఒక కనుబొమ్మపై గాటులాగా ఉండటంతో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ సినిమా లుక్కు కోసం అలా అయ్‌ బ్రోను షేవ్‌ చేసుకుందా? అని కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement