బాక్సింగ్‌కు రెడీ అవుతున్న హీరో | Farhan Akthar Shares His New Film Toofan First Look | Sakshi
Sakshi News home page

‘తుఫాన్‌’లో బాక్సర్‌గా ఫర్హాన్‌ అక్తర్‌

Jan 2 2020 5:26 PM | Updated on Jan 2 2020 7:25 PM

Farhan Akthar Shares His New Film Toofan First Look - Sakshi

బాలీవుడ్‌ హీరో ఫర్హాన్‌ అక్తర్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్‌’. స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను ఫర్హాన్‌ అక్తర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. జెర్సీ ధరించి బాక్సింగ్‌ రింగులో నిలుచుని ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు కసిగా చూస్తున్నట్టున్న ఈ పోస్టర్‌కు.. ‘ది రాక్‌ ఆన్‌’  అనే క్యాప్షన్‌ను జత చేసి అభిమానులతో పంచుకున్నాడు. అదే విధంగా.. ‘ఎప్పుడైతే జీవితం కష్టంగా మారుతుందో.. అప్పుడే మరింత బలవంతులం అవుతాం. దానికి ఉదాహరణ ‘తుఫాన్‌’. ఇది 2020 అక్టోబర్‌2 న మీ ముందుకు రాబోతుంది. మీరు ఈ ‘తుఫాన్‌’ను తప్పక ఇష్టపడతారని నా నమ్మకం’ అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చాడు. కాగా తుఫాన్‌లో బాక్సర్‌గా తన అభిమానులను మెప్పించడానికి ఫర్హాన్‌ బాగానే శ్రమించాడని... ఇందుకోసం బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న తుఫాన్‌ చిత్రానికి  ఓం ప్రకాష్‌ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరి కలయికలో స్పోర్ట్స్‌ డ్రామా ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 2013లో విడుదలైన ఈ సినిమాలో ఫర్హాన్‌ రన్నర్‌గా కనిపించాడు. ఇక ఫర్హాన్‌ అక్తర్‌, ప్రియాంక చోప్రా నటించిన ‘స్కై ఈజ్‌ పింక్‌’ సినిమా గత ఏడాది అక్టోబర్‌ 11 విడుదలై టొరంటో అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో ప్రదర్శించబడింది.

Advertisement
 
Advertisement
Advertisement