రెండేళ్లలో ఎంత మార్పు... | Fardeen Khan Has Had A Physical Transformation | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో ఎంత మార్పు...

Jul 16 2018 1:07 PM | Updated on Apr 3 2019 5:44 PM

Fardeen Khan Has Had A Physical Transformation - Sakshi

ఫర్దీన్ ఖాన్‌ (ఇప్పుడు - గతంలో)

విమర్శలు ఇంత పని చేస్తాయా...

బాలీవుడ్‌ నటుడు ఫర్దీన్ ఖాన్ గుర్తుండే ఉంటుంది. రెండేళ్ల​ క్రితం ఈ నటుడు తన శరీర బరువు గురించి విపరీతమైన విమర్శలు ఎదుర్కోన్నారు. ‘మీరు బాగా లావెక్కుతున్నారు, తెగ చబ్బీ అవుతున్నారు చూడలేక పోతున్నామంటూ’ నెటిజన్లు ఈ నటున్ని తెగ ట్రోల్‌ చేశారు. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఫర్దీన్‌ను చూసిన వారు ముందు కాస్తా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. అంతేనా విమర్శలు ఇంత పని చేస్తాయా అనుకోక మానరు. ఫర్దీన్‌ ఎయిర్‌ పోర్టులో ఉండగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రెండేళ్లలో ఎంత మార్పు అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఫర్దీన్‌ చాలా ఫిట్‌గా, పర్ఫేక్ట్‌ ఫిజిక్‌తో తనను విమర్శించిన వారందరి నోళ్లు మూయించాడు.

ఈ విషయం గురించి ఫర్దీన్‌ ఖాన్‌ ‘నా శరీర బరువు గురించి విమర్శలు వచ్చినప్పుడు నేను వాటి గురించి ఆలోచిస్తూ నా బుర్ర పాడు చేసుకోలేదు. నన్ను కామెంట్‌ చేసిన వారంతా నేను ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నారు కదా అనిపించింది. అందుకే ఫిట్‌నేస్‌పై శ్రద్ద పెట్టాను. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను’ అని తెలిపారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్‌ ట్రెండ్‌ గురించి మాట్లాడుతూ ‘ప్రతికూలంగా ట్రోల్‌ చేసేవారిని ప్రశ్నించకపోతే ఈ వెర్రి మరింత పెరిగిపోతుంది. ట్రోల్‌ చేసేవారు తామే కరెక్ట్‌ అనే భావనలోకి వెళ్లి పోతారు. తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు అందరికి ఉంది. కానీ ఇలా చాటుగా (ఇంటర్నెట్‌లో)కాదు.. ధైర్యంగా ఎలుగెత్తి మీ అభిప్రాయాలను వ్యక్తపర్చండి’ అంటూ సలహా ఇచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement