అభిమానుల వల్లే మేం ఈ స్థానంలో ఉన్నాం! | Fans make us who we are, says Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

అభిమానుల వల్లే మేం ఈ స్థానంలో ఉన్నాం!

Jan 6 2016 12:56 PM | Updated on Sep 3 2017 3:12 PM

అభిమానుల వల్లే మేం ఈ స్థానంలో ఉన్నాం!

అభిమానుల వల్లే మేం ఈ స్థానంలో ఉన్నాం!

ప్రతి ఆదివారం ముంబైలోని ఆయన బంగ్లా ముందు వేలమంది అభిమానులు గుమిగూడుతారు. ట్విట్టర్‌లో ఒక భారతీయ నటుడిగా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఆయన.

న్యూఢిల్లీ: ప్రతి ఆదివారం ముంబైలోని ఆయన బంగ్లా ముందు వేలమంది అభిమానులు గుమిగూడుతారు. ట్విట్టర్‌లో ఒక భారతీయ నటుడిగా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఆయన. ఆయన రాసే 'బ్లాగ్‌'ను క్రమంతప్పకుండా చదివే పాఠకులు ఉన్నారు. అయినా 73 ఏళ్ల ఆ బాలీవుడ్ లెజండ్‌ ఇప్పటికీ తన అభిమానుల పట్ల కృతజ్ఞాత భావంతోనే ఉన్నారు. అభిమానులు ఒక నటుడి కెరీర్‌లో కీలకమైన భాగమని, వారి వల్ల తాము ఈ స్థాయిలో ఉన్నామని వినమ్రంగా చెబుతారు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌.

నాలుగు దశాబ్దాల తన సినిమా ప్రస్థానంలో అమితాబ్ బచ్చన్ ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. విమాన ప్రయాణంలో తనను చూసో, తనతో సెల్ఫీలు దిగో అభిమానులు ఎంతోగానో సంతోష పడుతుంటారని ఆయన చాలాసార్లు ట్విట్టర్‌లో పంచుకున్నారు. అయితే, భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న అమితాబ్‌ మాత్రం ఇందులో తన ప్రత్యేకతేమీ లేదంటున్నారు. ఒక నటుడిగా, సెలబ్రిటీగా సాధారణంగానే తనకు ప్రేక్షకాభిమానం లభిస్తుందని, అది నటుడి కెరీర్‌లో భాగమని తెలిపారు.

'సెలబ్రిటీగా ఉన్న ఎవరికైనా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. అభిమానులు నటుడి కెరీర్‌లో కీలకభాగం. వారి వల్ల మేం ఈ స్థాయికి ఎదిగాం. వారి పట్ల శ్రద్ధ చూపడం లేదా, వారి దృష్టిని తమ వైపు తిప్పుకోవడం సమర్థనీయమే' అని అమితాబ్‌ బుధవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమితాబ్ నటించిన 'వజీర్‌' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతోపాటు 'టీఈ3ఎన్' సినిమాతో కూడా ఈ ఏడాది ఆయన ప్రేక్షకులను పలుకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement