తండ్రి కాబోతున్న ఆనందాన్ని వర్ణించాలంటే! | Excited would be a huge understatement, says Shahid Kapoor | Sakshi
Sakshi News home page

తండ్రి కాబోతున్న ఆనందాన్ని వర్ణించాలంటే!

May 10 2016 6:32 PM | Updated on Sep 3 2017 11:45 PM

తండ్రి కాబోతున్న ఆనందాన్ని వర్ణించాలంటే!

తండ్రి కాబోతున్న ఆనందాన్ని వర్ణించాలంటే!

'ఎంతో ఎక్సైటింగ్‌ ఉందని చెప్పినా అది చాలా చిన్నమాటే అవుతుంది'.. ఇది బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ స్పందన.

'ఎంతో ఎక్సైటింగ్‌ ఉందని చెప్పినా అది చాలా చిన్నమాటే అవుతుంది'..  ఇది బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ స్పందన. తండ్రి కాబోతున్నారు కదా! మీకెలా అనిపిస్తోంది? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. కెమెరా ముందు విభిన్న పాత్రల్లో అభినయించిన ఈ యంగ్‌ హీరో త్వరలో తండ్రి అనే బాధ్యతాయుతమైన పాత్రను పోషించబోతున్నాడు. అతని భార్య మీరా రాజ్‌పుత్‌ ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అదే సమయంలో షాహిద్ బాలీవుడ్ చిత్రసీమలో అడుగుపెట్టి సోమవారం నాటికి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పూరస్కరించుకొని థర్టీన్ ఇయర్స్ ఆఫ్ షాహిద్‌ కపూర్‌ (#13YearsOfShahidKapoor) హ్యాష్‌ట్యాగ్‌ తో ఆయన అభిమానులు ట్విట్టర్లో పోస్టులు చేశారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్‌ ఇండియాలో టాప్ ట్రెండింగ్‌ గా చాలాసేపు హల్‌చల్ చేసింది.

షాహిద్ తాజా చిత్రం 'ఉడ్తా పంజాబ్‌' భారీ అంచనాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పనులతో బిజీగా ఉన్న అతను సోమవారం కాసేపు తీరిక చేసుకొని అభిమానుల్ని పలుకరించాడు. ట్విట్టర్‌లో వారితో నేరుగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. మీ సతీమణి మీరా రాజ్‌పుత్‌లో గొప్ప విషయమేమిటని ఓ అభిమాని అడుగగా.. 'వాస్తవికత' (రియల్‌) అంటూ ఒక్క మాటలో బదులిచ్చాడు షాహిద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement