చరణ్ సినిమాలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ

Esha Gupta Special Song in Ram Charan Vinaya Vidheya Rama - Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ సినిమా వినయ విధేయ రామ. మాస్‌ మసాల ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి మరింత గ్లామర్‌ యాడ్‌ చేసేందుకు ఓ స్పెషల్‌ సాంగ్‌ను తెరకెక్కించనున్నారు. బోయపాటి సినిమాలతో పాటు చరణ్ సినిమాల్లోనూ  స్పెషల్‌ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్స్‌ కనిపిస్తుంటారు. తమన్నా, పూజా హెగ్డే, కేథరిన్‌ లాంటి వారు వీరి సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేశారు.

ఈ సినిమాలో కూడా ఓ క్రేజీ స్టార్‌తో స్పెషల్ సాంగ్ చేయించాలని భావిస్తున్నారట చిత్రయూనిట్‌. అయితే సౌత్‌ భామలు రొటీన్‌ కావటంతో ఓ బాలీవుడ్ హాట్‌ బ్యూటీని సెలెక్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సినిమాలతో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోలతో హల్‌చల్‌ చేస్తున్న ఈషా గుప్తా, వినయ విధేయ రామలో చరణ్ సరసన ఆడిపాడనుందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top