అనుకోకుండా జరిగిపోయింది: భావన | Engagement happened suddenly, says Actress Bhavana | Sakshi
Sakshi News home page

అనుకోకుండా జరిగిపోయింది: భావన

Mar 13 2017 9:36 PM | Updated on Sep 5 2017 5:59 AM

అనుకోకుండా జరిగిపోయింది: భావన

అనుకోకుండా జరిగిపోయింది: భావన

కన్నడ నిర్మాత నవీన్‌తో తన నిశ్చితార్థం అనుకోకుండా జరిగిందని మలయాళీ నటి భావన చెప్పారు.

హైదరాబాద్‌: కన్నడ నిర్మాత నవీన్‌తో తన నిశ్చితార్థం అనుకోకుండా జరిగిందని మలయాళీ నటి భావన చెప్పారు. ఎలాంటి ప్రకటన లేకుండా నిశ్చితార్ధం చేసుకోవడంపై మళయాళీ మీడియా భావనను ప్రశ్నించింది. వాటికి స్పందించిన భావన.. నవీన్‌ కుటుంబ సభ్యులతో కలిసి తనను చూడటానికి సంప్రదాయ ప్రకారం వచ్చారని చెప్పారు. ఇరు కుటుంబాలు ఒకేచోట కలవడంతో అప్పటికప్పుడు నిశ్చితార్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
 
దాంతో అనుకోకుండా నిశ్చితార్ధం జరిగినట్లు చెప్పారు. స్నేహితులను కూడా నిశ్చితార్ధానికి పిలవలేకపోయానని తెలిపారు. భావన-నవీన్‌ల నిశ్చితార్ధపు ఫోటోలు కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. భావన, నవీన్‌ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. వీరి వివాహ వేడుకను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement