ముగ్గురి ప్రేమ

Enduko Emo is all set to release on the occasion of Vinayaka chavithi - Sakshi

మహేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మించిన చిత్రం ‘ఎందుకో ఏమో’. నందు, నోయల్, పునర్నవి భూపాలం నాయకా  నాయికలుగా నటించిన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఇది. ‘‘వినాయక చవితి సందర్భంగా ఈ నెల 12న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర నిర్మాత మాలతి తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇది నా తొలి సినిమా. ఎంతో నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. లవ్‌ స్టోరీతో పాటు కమర్షియల్‌ అంశాలు ఉన్న చిత్రం. మంచి కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలను ప్రజలు ఆదరిస్తారు.

మా సినిమా అలాంటిదే’’ అన్నారామె. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘ఇది ముగ్గురి మధ్య జరిగే ప్రేమకథ . ఫ్యామిలీ, యూత్‌ను మా సినిమా ఆకట్టుకుంటుంది. నందు, నోయల్, పునర్నవి ఎవరికి వారు పోటి పడి నటించారు. క్లైమాక్స్‌ మా చిత్రానికి హైలెట్‌. కథ, కధనాలు కొత్తగా ఉంటాయి’’ అన్నారు. నందు మాట్లాడుతూ– ‘‘మహిళా నిర్మాత సినిమాలో నటించడం నాకిది ఫస్ట్‌ టైమ్‌. ఎంతో అభిరుచితో నిర్మించిన ఈ చిత్రంలో నటించినందుకు హ్యాపీగా ఉంది. నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కోటి గారికి థ్యాంక్స్‌. ఈ సినిమా ద్వారా నోయల్, పునర్నవి మంచి స్నేహితులయ్యారు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top