ఇమ్రాన్ హష్మీతో హిందీలో ‘మాయ’! | Emraan Hashmi in Maaya remake? | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్ హష్మీతో హిందీలో ‘మాయ’!

Aug 5 2014 12:38 AM | Updated on Sep 2 2017 11:22 AM

ఇమ్రాన్ హష్మీతో హిందీలో ‘మాయ’!

ఇమ్రాన్ హష్మీతో హిందీలో ‘మాయ’!

‘‘విభిన్న తరహాలో సాగే సినిమాలు చేయడం నాకు ఆసక్తి. అందుకే ఎప్పటికప్పుడు వినూత్న కథాంశాలు ఎన్నుకుంటాను. ఈ చిత్రం విడుదలైన రోజున కాస్త టెన్షన్ పడ్డాను.

 ‘‘విభిన్న తరహాలో సాగే సినిమాలు చేయడం నాకు ఆసక్తి. అందుకే ఎప్పటికప్పుడు వినూత్న కథాంశాలు ఎన్నుకుంటాను. ఈ చిత్రం విడుదలైన రోజున కాస్త టెన్షన్ పడ్డాను. కానీ, ఆదివారం హౌస్‌ఫుల్ కావడంతో రిలీఫ్ అనిపించింది. సినిమా చూసినవాళ్లందరూ వినూత్న అనుభూతికి గురి చేసిందని, కథ కొత్తగా ఉందని అంటుంటే ఆనందంగా ఉంది’’ అని నీలకంఠ చెప్పారు.
 
  ఆయన దర్శకత్వంలో మధుర శ్రీధర్, ఎమ్.వి.కె. రెడ్డి నిర్మించిన ‘మాయ’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఆ తర్వాత వసూళ్లు పెరిగాయని మధుర శ్రీధర్ చెబుతూ - ‘‘కన్నడ నిర్మాత శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నారు. ఒరియా, బెంగాలీ భాషల రీమేక్ హక్కులకు సంప్రతింపులు జరుగుతున్నాయి. హిందీలో ఇమ్రాన్ హష్మీతో రీమేక్ చేస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలుపెట్టాం’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement