మూవీలకు ఏడాది గ్యాప్ ఇచ్చింది!

మూవీలకు ఏడాది గ్యాప్ ఇచ్చింది!


లండన్: బహిరంగ ప్రదేశాల్లో చురుగ్గా కనిపించకుండా బోరింగ్‌ పర్సన్‌లా ఉండటానికే ఇష్టపడే హాలీవుడ్ తార ఎమ్మా వాట్సన్‌. ఓ ఏడాది పాటు ఈ ముద్దుగుమ్మ సినిమాల జోలికి వెళ్లనంటోంది. తనకు కొన్ని పనులున్నాయని వాటిని నిర్వహించిన తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తానని చెపుతోంది ఎమ్మా వాట్సన్‌. 'హ్యారీపొటర్‌' సిరీస్‌ చిత్రాల్లో హెర్మియన్ గ్రాంజర్‌గా నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ సుందరి. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్ 'హీ ఫర్ షీ' లాంటి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. స్త్రీవాదం గురించి తాను ఎంతో తెలుసుకోవాల్సి ఉందని, ఎన్నో పుస్తకాలు చదవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.కేవలం రెండు విషయాలపై దృష్టిసారించడానికి ఈ గ్యాప్ తనకు అవసరమని మీడియాకు వివరించింది. మొదటిది స్త్రీవాదం, లింగ సమానత్వం కాగా, వ్యక్తిత్వ వికాసం రెండో అంశమని వెల్లడించింది. ఇప్పటినుంచి ప్రతివారం ఓ బుక్ చదవడం లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు తన వద్ద ఉన్న లైబ్రరీ నుంచి నెలకు మరో పుస్తకాన్ని చదవడాన్ని ఎంచుకున్నట్లు చెప్పింది. ప్రపంచంలో ఎన్ని రకాల మహిళలు ఉంటారో తెలుసుకుంటానంటోంది. ఎమ్మా తదుపరి చిత్రం 'బ్యూటీ అండ్ ద బీస్ట్' తో 2017లో వెండితెర మీద కనిపించనుందట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top