ఆయనతో డేటింగ్ కు ఎవరూ నో చెప్పరు! | emi jackson about dating | Sakshi
Sakshi News home page

ఆయనతో డేటింగ్ కు ఎవరూ నో చెప్పరు!

Dec 3 2016 1:11 AM | Updated on Sep 4 2017 9:44 PM

ఆయనతో డేటింగ్ కు ఎవరూ నో చెప్పరు!

ఆయనతో డేటింగ్ కు ఎవరూ నో చెప్పరు!

ఆయనతో డేటింగ్ చేయడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు అంటోంది ఆంగ్ల బ్యూటీ ఎమీజాక్సన్.

ఆయనతో డేటింగ్ చేయడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు అంటోంది ఆంగ్ల బ్యూటీ ఎమీజాక్సన్.ఇంతకీ ఈ భామను అంతగా ఆకర్షించిన నటుడెవరో తెలుసుకోవాన్న ఆసక్తి పెరుగుతోందా? ఆ మధ్య హిందీచిత్రం ఏక్ దీవానాలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర హీరో ప్రతీక్ బాబర్‌తో ప్రేమకలాపాలు నడిపిన ఎమీజాక్సన్ ఆ తరువాత వారి ప్రేమ బ్రేకప్ అవ్వడంతో కొంత కాలం సెలైంట్‌గా ఉంది. తాజాగా కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో చెట్టాపట్టాల్ అనే ప్రచారం సోషల్‌మీడియాలో జోరుగా సాగుతోంది. ఇది ఆనోటా ఈ నోటా అమ్మడి చెవికి చేరడంతో కింది విధంగా  స్పందించింది. ఎవ్వరితోనూ ప్రేమ, దోమా లేదని స్పష్టం చేసింది. తానిప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నానని చెప్పింది. అరుునా నటుడు సల్మాన్‌ఖాన్‌తో ఎవరు మాత్రం డేటింగ్ చేయరు చెప్పండి అంటూ ప్రశ్నించింది కూడా. ఆయన తనకు మంచి స్నేహితుడని, బాలీవుడ్‌లో తనకు మార్గదర్శి అని పేర్కొంది.

అంతే కాదు తనకు నమ్మకాన్ని పెంచిన మంచి మిత్రుడు సల్మాన్‌ఖాన్ అని చెప్పింది. ఆయన తన ఆహార్యాన్ని ఎలా మెరుున్‌టెరుున్ చేస్తున్నారో తనకే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఇటీవల అతి కొద్ది రోజుల్లోనే తన బరువును 20 కేజీలకు తగ్గించారు. అదెలా సాధ్యం అని ఇటీవల 2.ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కలిసినప్పుడు అడిగేశాను కూడా అని అంది. తన శరీరంపై అంత శ్రద్ధచూపించే సల్మాన్‌ఖాన్‌తో తనకున్నది మంచి స్నేహమే అని ఎమీజాక్సన్ తెలిపింది. ఏదేమైనా నిప్పులేనిదే పొగరాదన్న విషయాన్ని మరచిపోరాదు అంటున్నారు సినీ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement