breaking news
Prateek Babbar
-
'రానా నాయుడు' బ్యూటీ రిలేషన్ కన్ఫర్మ్.. పెళ్లి అప్పుడే!
కొన్నాళ్ల ముందు 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రిలీజైంది. ఇందులో రానాని టెంప్ట్ చేసే పాత్రలో నటించిన ఓ అమ్మాయి.. బాగా హైలెట్ అయింది. ఈమెని ఇంతకుముందు ఎక్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు అనుకున్నారు. అవును ఓ పదేళ్ల క్రితం కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి ఇక్కడ పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. ఓ యంగ్ హీరోతో లవ్ కన్ఫర్మ్ చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) మూడేళ్లుగా కలిసే 'ప్రతీక్ నేను గత మూడేళ్లుగా కలిసున్నాం. మా బంధంపై పెద్దగా డిస్కషన్ జరగకూడదని.. రిలేషన్ గురించి బయటకు చెప్పలేదు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అఫీషియల్‌గా మా లవ్‌ని ప్రకటించాం. మాకు అనవసరమైన ప్రచారం అక్కర్లేదని భావించి ఇన్నాళ్లు ఊరుకున్నాం. ప్రతీక్ నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాం. తనకు పనిమీద ఫోకస్ ఎక్కువ. తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు' త్వరలో పెళ్లి 'రిలేషన్లో ఉన్నాం కదా మా పెళ్లి జరుగుతుంది. అయితే అది ఎప్పుడనేది మేం టైమ్ చూసుకుని ప్రకటిస్తాం. ప్రస్తుతానికైతే ప్రేమలో చాలా సీరియస్ గా ఉన్నాం. ఈ ఏడాది మాత్రం పెళ్లి చేసుకోం' అని నటి ప్రియా బెనర్జీ చెప్పుకొచ్చింది. పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు కానీ ఏడాదిలోనే విడిపోయారు. View this post on Instagram A post shared by prateik patil babbar (@_prat) (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) -
ఆయనతో డేటింగ్ కు ఎవరూ నో చెప్పరు!
ఆయనతో డేటింగ్ చేయడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు అంటోంది ఆంగ్ల బ్యూటీ ఎమీజాక్సన్.ఇంతకీ ఈ భామను అంతగా ఆకర్షించిన నటుడెవరో తెలుసుకోవాన్న ఆసక్తి పెరుగుతోందా? ఆ మధ్య హిందీచిత్రం ఏక్ దీవానాలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర హీరో ప్రతీక్ బాబర్‌తో ప్రేమకలాపాలు నడిపిన ఎమీజాక్సన్ ఆ తరువాత వారి ప్రేమ బ్రేకప్ అవ్వడంతో కొంత కాలం సెలైంట్‌గా ఉంది. తాజాగా కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో చెట్టాపట్టాల్ అనే ప్రచారం సోషల్‌మీడియాలో జోరుగా సాగుతోంది. ఇది ఆనోటా ఈ నోటా అమ్మడి చెవికి చేరడంతో కింది విధంగా స్పందించింది. ఎవ్వరితోనూ ప్రేమ, దోమా లేదని స్పష్టం చేసింది. తానిప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నానని చెప్పింది. అరుునా నటుడు సల్మాన్‌ఖాన్‌తో ఎవరు మాత్రం డేటింగ్ చేయరు చెప్పండి అంటూ ప్రశ్నించింది కూడా. ఆయన తనకు మంచి స్నేహితుడని, బాలీవుడ్లో తనకు మార్గదర్శి అని పేర్కొంది. అంతే కాదు తనకు నమ్మకాన్ని పెంచిన మంచి మిత్రుడు సల్మాన్‌ఖాన్ అని చెప్పింది. ఆయన తన ఆహార్యాన్ని ఎలా మెరుున్టెరుున్ చేస్తున్నారో తనకే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఇటీవల అతి కొద్ది రోజుల్లోనే తన బరువును 20 కేజీలకు తగ్గించారు. అదెలా సాధ్యం అని ఇటీవల 2.ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కలిసినప్పుడు అడిగేశాను కూడా అని అంది. తన శరీరంపై అంత శ్రద్ధచూపించే సల్మాన్‌ఖాన్‌తో తనకున్నది మంచి స్నేహమే అని ఎమీజాక్సన్ తెలిపింది. ఏదేమైనా నిప్పులేనిదే పొగరాదన్న విషయాన్ని మరచిపోరాదు అంటున్నారు సినీ వర్గాలు.