హృదయాలను హత్తుకునే ప్రేమ | edhi na love story relase to shortly | Sakshi
Sakshi News home page

హృదయాలను హత్తుకునే ప్రేమ

Jul 2 2017 11:34 PM | Updated on Sep 5 2017 3:02 PM

హృదయాలను హత్తుకునే ప్రేమ

హృదయాలను హత్తుకునే ప్రేమ

లవర్‌బోయ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇది నా లవ్‌ స్టోరీ’. ఓవియా కథానాయిక.

లవర్‌బోయ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇది నా లవ్‌ స్టోరీ’. ఓవియా కథానాయిక. రమేష్‌ గోపి దర్శకత్వంలో రామ్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై ఎస్‌వీ ప్రకాష్‌ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తరుణ్‌ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా రమేష్‌ గోపి చక్కగా తెరకెక్కించారు. శ్రీనాథ్‌ విజయ్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ పాయింట్‌. నేపథ్య సంగీతం ఎక్స్‌ట్రార్డినరీగా కుదిరింది’’ అన్నారు.

‘‘సినిమా బాగా వచ్చింది. తరుణ్‌గారి నటన సూపర్బ్‌. ఈ సినిమాలో ఆయన నటనలోని మరో కోణాన్ని చూస్తారు. మేకింగ్‌ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రమేష్‌ గోపి. ‘‘ఒక మంచి ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి’’ అన్నారు శ్రీనాథ్‌ విజయ్‌. ఈ చిత్రానికి సమర్పణ: అభిరామ్‌.

Advertisement
 
Advertisement
Advertisement