దండుపాళ్యంలా... | Durmargudu Movie First Look Launch | Sakshi
Sakshi News home page

దండుపాళ్యంలా...

Jun 1 2018 12:25 AM | Updated on Jun 1 2018 12:26 AM

Durmargudu Movie First Look Launch - Sakshi

జరా ఖాన్, విజయ్‌ కృష్ణ

విజయ్‌ కృష్ణ, జరాఖాన్‌ జంటగా సునీత్‌ జంపా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దుర్మార్గుడు’. ఎ.ఎ.ఎ. సినిమాస్‌ సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై రాజవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. మోషన్‌ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టీజర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ రిలీజ్‌ చేశారు. రాజవంశీ మాట్లాడుతూ– ‘‘దండు పాళ్యం’ లాంటి మాస్‌ ఇమేజ్‌ ఉన్న చిత్రంలా ఉంటుంది. అందరూ కొత్తవారే నటించిన పక్కా తెలుగు సినిమా ఇది.

జులైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సునీత్‌ జంపా మాట్లాడుతూ – ‘‘మంగళగిరిలో డిస్ట్రిబ్యూటర్‌గా చేశా. ‘మురారి’ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నప్పుడే డైరెక్టర్‌ అవ్వాలనే ఆలోచన వచ్చింది. 2006లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి వచ్చా. ఈ సినిమా చూస్తున్నంతసేçపు ప్రేక్షకులు ఎమోషనల్‌గా ఫీల్‌ అవుతారు. మాస్, క్లాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. హీరో విజయ్‌ కృష్ణ, సహనిర్మాత బాల ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మల్లిక్‌ పుట్టా, మ్యూజిక్‌: చిన్ని కష్ణ, సహ నిర్మాత: బాల ప్రసాద్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement