ఆర్యతో డేటింగా? | Does Deepa date Arya? | Sakshi
Sakshi News home page

ఆర్యతో డేటింగా?

Aug 19 2014 1:21 AM | Updated on Sep 2 2017 12:04 PM

ఆర్యతో డేటింగా?

ఆర్యతో డేటింగా?

నటుడు ఆర్యతో డేటింగ్ గాసిప్స్ లిస్ట్‌తో కొత్తగా మరో తార చేరింది. ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న హీరోయిన్లతో డేటింగ్ అంటూ జరిగే ప్రచారం రోజు గురించి గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదు.

నటుడు ఆర్యతో డేటింగ్ గాసిప్స్ లిస్ట్‌తో కొత్తగా మరో తార చేరింది. ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న హీరోయిన్లతో డేటింగ్ అంటూ జరిగే ప్రచారం రోజు గురించి గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదు. నయనతార, అనుష్క నుంచి, ఈతరం హీరోయిన్లు హన్సిక, నజ్రియాల వరకు ఆర్యతో చెట్టాపట్టాలంటూ వదంతులు రావడం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కన్నడ నటి దీపా సన్నిధి చేరింది. ఈ బ్యూటీ ఆర్యతో కలిసి యట్చకన్ అనే చిత్రంలో నటిస్తోంది. విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోగా కృష్ణ నటిస్తున్నారు.
 
 ఈ చిత్ర షూటింగ్ సమయంలో దీపాసన్నిధి, ఆర్యల డేటింగ్ గురించి కోలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంపై దీపా సన్నిధి స్పందిస్తూ ఇలాంటి వదంతులు నిజంగా నవ్వు పుట్టిస్తున్నాయని పేర్కొంది. యట్చకన్ చిత్రం కోసం తానిప్పటి వరకు నాలుగు రోజులే పని చేశానని తెలిపింది. ఇంతలోనే ఆ చిత్ర హీరో ఆర్యతో డేటింగ్ అంటూ ప్రచారం చేస్తుండడం విడ్డూరంగా ఉంది. కన్నడంలో ప్రాచుర్యం పొందిన ఈ భామ తమిళంలో మరో చిత్రం కూడా చేస్తోంది. కన్నడంలో విజయం సాధించిన లూసియా చిత్రం తమిళ రీమేక్‌లో దీపా సన్నిధినే హీరోయిన్.
 
 సిద్దార్థ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం గురించి దీపా సన్నిధి మాట్లాడుతూ కన్నడ చిత్రం లూసియా తాను ముందుగానే చూశానని చెప్పింది. ఈ చిత్రం కోసం అడిషన్‌లో పాల్గొనే ముందే ఒరిజినల్ చిత్రం చూడటం చాలా హెల్ప్ అయ్యిందని తెలిపింది.  తనకు తమిళ భాష బాగానే అర్థం అవుతుందని తెలిపింది. పెద్ద డైలాగ్స్ ఉంటే  రిహార్సల్స్ చేసుకుని నటిస్తానని అంటున్న దీపా సన్నిధికి కోలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతున్నాయట. ఈ కన్నడ బ్యూటీ సెప్టెంబర్‌లో మరో తమిళ చిత్రం అంగీకరించనున్నట్లు తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement